Telugu Global
NEWS

కేసులున్నా ముందుకే.. ఏపీలో స్థిరంగా విద్యార్థుల హాజరు..

ఈనెల 16న ఏపీలో స్కూల్స్ తెరుచుకున్న తర్వాత వివిధ జిల్లాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకింది. కృష్ణాజిల్లాలోని ఓ హైస్కూల్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో 10మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గేందుకు ఇష్టపడటంలేదు. కరోనా కేసులు వెలుగు చూస్తున్నా.. అందరికీ స్వల్ప లక్షణాలే ఉండటం, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో స్కూల్స్ విషయంలో పునరాలోచన చేయట్లేదు. ఏ స్కూల్ […]

కేసులున్నా ముందుకే.. ఏపీలో స్థిరంగా విద్యార్థుల హాజరు..
X

ఈనెల 16న ఏపీలో స్కూల్స్ తెరుచుకున్న తర్వాత వివిధ జిల్లాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకింది. కృష్ణాజిల్లాలోని ఓ హైస్కూల్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో 10మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గేందుకు ఇష్టపడటంలేదు. కరోనా కేసులు వెలుగు చూస్తున్నా.. అందరికీ స్వల్ప లక్షణాలే ఉండటం, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో స్కూల్స్ విషయంలో పునరాలోచన చేయట్లేదు.

ఏ స్కూల్ లో అయినా ఉపాధ్యాయుడికి కానీ, విద్యార్థికి కానీ కరోనా సోకితే, వెంటనే స్కూల్ ని శానిటైజ్ చేయిస్తున్నారు. అలా కొవిడ్ సోకినవారి సంఖ్య 5 దాటితే మాత్రం స్కూళ్లకు వారం రోజులపాటు సెలవు ప్రకటిస్తున్నారు. దీనిపై కచ్చితమైన మార్గదర్శకాలు ఉండటంతో.. ఒకరిద్దరు కొవిడ్ బారినపడినా స్కూల్స్ మూసివేయకుండా రన్ చేస్తున్నారు. మరోవైపు ప్రతి వారం ర్యాండమ్ టెస్ట్ లు చేయిస్తున్నారు.

ఆందోళన ఉన్నా.. తగ్గని హాజరు..
స్కూల్స్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయనే వార్తలొస్తున్నా విద్యార్థుల హాజరు తగ్గకపోవడం విశేషం. స్కూల్స్ మొదలు పెట్టినప్పుడు తొలిరోజు 60శాతం హాజరు నమోదైంది. ఎన్నిరోజులు నడుస్తాయో చూద్దాం అంటూ.. తొలి వారం తమ పిల్లల్ని స్కూల్స్ కి పంపించనివారు కూడా ఇప్పుడు ధైర్యం చేస్తున్నారు. దీంతో హాజరు శాతం నిలకడగానే ఉన్నట్టు చెబుతున్నారు అధికారులు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

First Published:  26 Aug 2021 10:27 PM GMT
Next Story