Telugu Global
Cinema & Entertainment

కాజల్ చెల్లెలు.. మళ్లీ తెరపైకి

అక్క కాజల్ కంటే ఆలస్యంగా తెరపైకొచ్చింది. కానీ కాజల్ కంటే తొందరగానే తట్టాబుట్టా సర్దేసింది. అంతేకాదు, కాజల్ కంటే ముందుగానే పెళ్లి చేసుకొని ఓ పిల్లాడికి కూడా జన్మనిచ్చింది. అలా అన్నీ త్వరత్వరగా కానిచ్చేసిన నిషా అగర్వాల్, ఇప్పుడు మరోసారి కెమెరాపై దృష్టిపెట్టింది. వెంకటేశ్‌, రానా కాంబినేషన్‌లో ఓ వెబ్‌సిరీస్‌ రాబోతోందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ తో డీల్ కుదిరిందని కూడా అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్ర కోసం […]

కాజల్ చెల్లెలు.. మళ్లీ తెరపైకి
X

అక్క కాజల్ కంటే ఆలస్యంగా తెరపైకొచ్చింది. కానీ కాజల్ కంటే తొందరగానే తట్టాబుట్టా సర్దేసింది.
అంతేకాదు, కాజల్ కంటే ముందుగానే పెళ్లి చేసుకొని ఓ పిల్లాడికి కూడా జన్మనిచ్చింది. అలా అన్నీ
త్వరత్వరగా కానిచ్చేసిన నిషా అగర్వాల్, ఇప్పుడు మరోసారి కెమెరాపై దృష్టిపెట్టింది.

వెంకటేశ్‌, రానా కాంబినేషన్‌లో ఓ వెబ్‌సిరీస్‌ రాబోతోందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ తో డీల్ కుదిరిందని కూడా అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్ర కోసం నిషా అగర్వాల్ ను తీసుకుంటున్నారట. వివాహం తర్వాత నిషా అగర్వాల్‌ సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే.. ఈ వెబ్‌సిరీస్‌తో మరోసారి టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెబ్‌ సిరీస్‌ దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించినట్లు.. దానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కథనాలు వస్తున్నాయి.

ఏమైంది ఈ వేళ, సుకుమారుడు, సోలో లాంటి సినిమాలతో పేరు తెచ్చుకుంది నిషా అగర్వాల్. మెల్లమెల్లగా కెరీర్ ఊపందుకుంటున్న టైమ్ లో ముంబయి బిజినెస్ మేన్ కరణ్ ను పెళ్లి చేసుకుంది. 2013 డిసెంబర్ లో వీళ్ల పెళ్లి జరగ్గా, అప్పట్నుంచి వెండితెరకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. మళ్లీ ఇన్నాళ్లకు ముఖానికి రంగేసుకోబోంది.

First Published:  25 Aug 2021 7:00 AM GMT
Next Story