Telugu Global
Cinema & Entertainment

జయలలిత బయోపిక్ వచ్చేస్తోంది

లెజెండ్రీ న‌టి, త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత.. జీవితంలోని వివిధ ద‌శల్ని ఆవిష్కరించేలా తెరకెక్కిన సెమీ-బయోపిక్ తలైవి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్.. జ‌య‌ల‌లిత జీవితంలోని జ‌రిగిన కీల‌క‌మైన ప‌రిణామాల‌ను తెలియ‌జేసేదిగా ఉండ‌టంతో, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో నిర్మాత‌లు తలైవి సినిమా విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల […]

జయలలిత బయోపిక్ వచ్చేస్తోంది
X

లెజెండ్రీ న‌టి, త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత.. జీవితంలోని వివిధ ద‌శల్ని ఆవిష్కరించేలా తెరకెక్కిన సెమీ-బయోపిక్ తలైవి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్.. జ‌య‌ల‌లిత జీవితంలోని జ‌రిగిన కీల‌క‌మైన ప‌రిణామాల‌ను తెలియ‌జేసేదిగా ఉండ‌టంతో, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో నిర్మాత‌లు తలైవి సినిమా విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ను
గ‌మ‌నిస్తే ఎం.జి.ఆర్‌, జ‌య‌ల‌లిత క‌లిసి న‌టించిన ఆప్ప‌టి క్లాసిక్ చిత్రంలోని రొమాంటిక్ లుక్‌తో పాటు
ఎం.జి.ఆర్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించడానికి వెళుతుండ‌టాన్ని గ‌మ‌నించవ‌చ్చు. అర‌వింద స్వామి ‘తలైవి’లో
ఎం.జి.ఆర్ పాత్ర‌లో న‌టించారు. సెప్టెంబర్ 10న తలైవి సినిమా థియేటర్లలోకి రానుంది.

విబ్రి మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మించిన ఈ సినిమాలో జీ స్టూడియోస్ భాగస్వామిగా చేరింది. తలైవి సినిమాను హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో జీ స్టుడియోస్ విడుదల చేయబోతోంది. దీంతో పాటు ఈ 3 భాషలకు చెందిన శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ గ్రూప్ దక్కించుకుంది.

First Published:  24 Aug 2021 10:01 AM GMT
Next Story