Telugu Global
National

బీహార్ కాలేజీలో జడ వివాదం.. తాలిబన్లే మేలంటూ ఆందోళన..

తాలిబన్లు మహిళా విద్యను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. గతంలో మహిళా విద్యను పూర్తిగా నిషేధించిన తాలిబన్లు, ఈసారి మాత్రం కో ఎడ్యుకేషన్ వద్దని తీర్మానించారు. ఆ విషయాన్ని పక్కనబెడితే.. భారత్ లో కూడా అలాంటి నిబంధనలే ఉన్నాయని, తమ స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదంటూ బీహార్ లో విద్యార్థినులు ఆందోళనకు దిగడం విశేషం. జడ వేసుకుంటేనే కాలేజీకి.. బీహార్ లోని భాగల్ పూర్ లో సుంద‌ర‌వ‌తి మహిళా మహా విద్యాలయ్ అనే కాలేజీ ఉంది. బీహార్ లోనే ఆ […]

బీహార్ కాలేజీలో జడ వివాదం.. తాలిబన్లే మేలంటూ ఆందోళన..
X

తాలిబన్లు మహిళా విద్యను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. గతంలో మహిళా విద్యను పూర్తిగా నిషేధించిన తాలిబన్లు, ఈసారి మాత్రం కో ఎడ్యుకేషన్ వద్దని తీర్మానించారు. ఆ విషయాన్ని పక్కనబెడితే.. భారత్ లో కూడా అలాంటి నిబంధనలే ఉన్నాయని, తమ స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదంటూ బీహార్ లో విద్యార్థినులు ఆందోళనకు దిగడం విశేషం.

జడ వేసుకుంటేనే కాలేజీకి..
బీహార్ లోని భాగల్ పూర్ లో సుంద‌ర‌వ‌తి మహిళా మహా విద్యాలయ్ అనే కాలేజీ ఉంది. బీహార్ లోనే ఆ కాలేజీ బాగా ఫేమస్. అక్కడ చదువుకున్న ఎంతోమంది ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారు, ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం 1500మంది విద్యార్థినులు అక్కడ వివిధ రకాల కోర్సులు చేస్తున్నారు. అలాంటి కాలేజీ ఇప్పుడో కొత్త నిబంధన తీసుకు రావడం సంచలనంగా మారింది. కాలేజీకి వ‌చ్చే విద్యార్థినులు త‌ప్ప‌ని సరిగా జ‌డ వేసుకొని రావాలని, లూజ్ హెయిర్‌ తో వ‌స్తే అనుమ‌తించేది లేద‌ని కాలేజీ ప్రిన్సిపల్ రామన్​ సిన్హా స్ప‌ష్టం చేశారు. డ్రెస్ కోడ్ కూడా పాటించాల్సిందేనని చెప్పారు. శరీరం కనిపించేలా ఉండే మోడ్రన్ దుస్తులతో కాలేజీకి రావొద్దని, చుడీదార్, చీర, లేదా పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచే దుస్తుల్లో మాత్రమే రావాలని కండిషన్ పెట్టారు. అంతేకాదు కాలేజీలో సెల్ ఫోన్ల వినియోగంపై కూడా ఆంక్షలు విధించారు. కాలేజీ ఆవరణలో సెల్ఫీలు దిగడం నిషేధించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ రూల్స్ తాలిబన్ల పాలన కంటే ఘోరంగా ఉన్నాయని విద్యార్థినులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు.

ఎలాంటి డ్రెస్ వేసుకొని రావాలో కాలేజీ ఎలా నిర్ణ‌యిస్తుంద‌ని, అది త‌మ స్వేచ్చ‌కు భంగం క‌లిగించిన‌ట్టే అవుతుంద‌ని విద్యార్ధినులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎలా చ‌దువుతున్నార‌నే దానిపై దృష్టిపెట్టాలి కాని, డ్రెస్ కోడ్ పేరుతో విద్యార్థినుల స్వేచ్చ‌కు భంగం క‌లిగించ‌కూడ‌దంటూ ఆందోళనకు దిగారు. కాలేజీ యాజమాన్యం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇది కాలేజీ కమిటీ తీసుకున్న నిర్ణయం అని, కచ్చితంగా అమలు చేసి తీరతామంటున్నారు ప్రిన్సిపల్.

First Published:  23 Aug 2021 9:42 PM GMT
Next Story