Telugu Global
Cinema & Entertainment

ఒకే సినిమాకు రెండోసారి ఫస్ట్ లుక్

ఏ సినిమాకైనా ఒకేసారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు. ఆమధ్య ఒకేసారి 2 ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసిన సందర్భాలు కూడా చూశాం. కానీ ఇది మరీ వెరైటీ. లిరికల్ సాంగ్స్ వచ్చేసి, హీరో లుక్ ఏంటనేది తెలిసిపోయిన తర్వాత, మళ్లీ ఫ్రెష్ గా ఫస్ట్ లుక్ అంటూ ఓ పెద్ద ఈవెంట్ పెట్టారు. రౌడీ బాయ్స్ అనే సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా పరిచయమౌతున్న సినిమా రౌడీ బాయ్స్. […]

ఒకే సినిమాకు రెండోసారి ఫస్ట్ లుక్
X

ఏ సినిమాకైనా ఒకేసారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు. ఆమధ్య ఒకేసారి 2 ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసిన సందర్భాలు
కూడా చూశాం. కానీ ఇది మరీ వెరైటీ. లిరికల్ సాంగ్స్ వచ్చేసి, హీరో లుక్ ఏంటనేది తెలిసిపోయిన తర్వాత, మళ్లీ ఫ్రెష్ గా ఫస్ట్ లుక్ అంటూ ఓ పెద్ద ఈవెంట్ పెట్టారు. రౌడీ బాయ్స్ అనే సినిమాకు సంబంధించిన మేటర్ ఇది.

దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా పరిచయమౌతున్న సినిమా రౌడీ బాయ్స్. అనుపమ
పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. సినిమాకు
సంబంధించి ఇప్పటికే లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. అందులోనే ఆశిష్ లుక్, గెటప్ అన్నీ బయటపెట్టారు. ఇప్పుడు తాజాగా ఫస్ట్ లుక్ అంటూ అప్పటి లిరికల్ వీడియోలోని స్టిల్స్ నే మరోసారి రిలీజ్ చేశారు.

నిజానికి లిరికల్ వీడియో విడుదల చేసిన కొన్ని రోజులకే టీజర్ లాంచ్ చేసి, దశలవారీగా ప్రచారం చేసి
సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా సినిమా రిలీజ్
వాయిదా పడింది. దీంతో మరోసారి పద్ధతి ప్రకారం.. ఫస్ట్ లుక్ నుంచి ప్రచారం స్టార్ట్ చేశారు. కొత్త హీరో ప్రాజెక్టు అవ్వడంతో పాటు దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా కావడంతో ఇలా ప్రచారాన్ని రిపీట్ చేశారు.

First Published:  24 Aug 2021 9:58 AM GMT
Next Story