Telugu Global
NEWS

1 నుంచి తెలంగాణలో పాఠశాలలు పునః ప్రారంభం..!

కరోనా కారణంగా మూతబడ్డ బడులు మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. వైరస్ తీవ్రత తగ్గుతుండటంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో పాఠశాలలను పునః ప్రారంభిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం కూడా అదే రోజు నుంచి పాఠశాలను ప్రారంభించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్ విద్యాశాఖకు ఆదేశాలు కూడా ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో గత మార్చి నెలలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. అప్పటి నుంచి పిల్లలకు ఆన్ […]

1 నుంచి తెలంగాణలో పాఠశాలలు పునః ప్రారంభం..!
X

కరోనా కారణంగా మూతబడ్డ బడులు మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. వైరస్ తీవ్రత తగ్గుతుండటంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో పాఠశాలలను పునః ప్రారంభిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం కూడా అదే రోజు నుంచి పాఠశాలను ప్రారంభించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్ విద్యాశాఖకు ఆదేశాలు కూడా ఇచ్చారు.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో గత మార్చి నెలలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. అప్పటి నుంచి పిల్లలకు ఆన్ లైన్లో మాత్రమే తరగతులు జరుగుతున్నాయి. కొద్ది నెలలుగా కరోనా ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుండడంతో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని అనేక రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఏపీలో ఈనెల 16వ తేదీన పాఠశాలలు ప్రారంభమయ్యాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకటవ తేదీనుంచి బడులను తెరవాలని విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చింది.

పాఠశాలల పునఃప్రారంభంపై సోమవారం సీఎం కేసీఆర్ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి కొద్దిరోజుల కిందటే పాఠశాలలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే ఈ విషయమై హైకోర్టు పలు ప్రశ్నలు సంధించడంతో వెనక్కి తగ్గింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతుండటం, ఇతర రాష్ట్రాల్లో కూడా విద్యా సంస్థలను ప్రారంభిస్తుండటంతో తెలంగాణలో కూడా పాఠశాలలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

First Published:  23 Aug 2021 11:28 AM GMT
Next Story