Telugu Global
National

స్కూళ్లు వద్దు.. సినిమా హాళ్లు ముద్దు..

కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల స్కూళ్లు, కాలేజీలు తెరుచుకుంటున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం స్కూళ్ల విషయంలో వెనకడుగు వేస్తున్నాయి, అదే సమయంలో సినిమాహాళ్లు మాత్రం పూర్తి స్థాయిలో తెరుచుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నాయి. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోంది. స్కూళ్లు, కాలేజీలు ఇంకా మొదలు కాకపోయినా, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో సందడి బాగా మొదలైంది. విద్యాశాఖ పలుమార్లు నివేదికలు పంపినా.. […]

స్కూళ్లు వద్దు.. సినిమా హాళ్లు ముద్దు..
X

కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల స్కూళ్లు, కాలేజీలు తెరుచుకుంటున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం స్కూళ్ల విషయంలో వెనకడుగు వేస్తున్నాయి, అదే సమయంలో సినిమాహాళ్లు మాత్రం పూర్తి స్థాయిలో తెరుచుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నాయి. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోంది. స్కూళ్లు, కాలేజీలు ఇంకా మొదలు కాకపోయినా, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో సందడి బాగా మొదలైంది. విద్యాశాఖ పలుమార్లు నివేదికలు పంపినా.. కేసీఆర్ సర్కారు మాత్రం స్కూల్స్ పునఃప్రారంభానికి ససేమిరా అంటోంది. ఇప్పుడు తమిళనాడు కూడా ఈ లిస్ట్ లో చేరింది. స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వడానికి ముందే సినిమా హాళ్లకు ఓకే చెప్పేసింది.

తమిళనాడులో అన్ లాక్..
లాక్ డౌన్ నిబంధనలు సవరించుకుంటూ వస్తున్న తమిళనాడు ప్రభుత్వం ఈనెల 23నుంచి సినిమా హాళ్లకు పర్మిషన్ ఇచ్చింది. అదే సమయంలో స్కూళ్లు, కాలేజీలకు మాత్రం సెప్టెంబర్ 1 తర్వాతే అనుమతిస్తామని తేల్చి చెప్పింది. అది కూడా కేవలం 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే స్కూల్స్ పెడతామంటోంది. 50 శాతం మాత్రమే హాజరు ఉండాలనే నిబంధన విధించింది. 1నుంచి 8 తరగతుల విద్యార్థులకు స్కూల్స్ తిరిగి మొదలు పెట్టే విషయంపై ఇంకా ఆలోచించలేదని చెబుతున్నారు అధికారులు. ఈమేరకు సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్ష నిర్వహించి సడలింపుల వివరాలు ప్రకటించారు.

తమిళనాడులో నిబంధనలు సడలిస్తూ లాక్ డౌన్ ని రెండు వారాలు పొడిగించారు. సెప్టెంబర్ 6 వరకు కొత్త నిబంధనలు అమలులో ఉంటాయని ప్రకటించారు. సాయంత్రం 6 గంటల వరకే షాపులు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. వివాహాది శుభకార్యాలకు మాత్రం రాత్రి 10 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు. ఈనెల 23నుంచి సినిమా హాళ్లు తెరుచుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తమిళ చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. అదే సమయంలో స్కూళ్లు, కాలేజీల విషయంలో ప్రభుత్వం స్థిరమైన నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తుండటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ప్రారంభించినా, తమిళనాడులో మాత్రం ఇంకా అనుమతివ్వకపోవడం సరికాదని అంటున్నారు ప్రతిపక్ష నేతలు.

First Published:  22 Aug 2021 6:16 AM GMT
Next Story