Telugu Global
CRIME

మొబైల్‌లో గేమ్స్ ఆడుతున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పోవచ్చు

బ్యాంకు వ్యవహారాలే తెలియని ఒక పిల్లవాడు తన తాత మొబైల్‌లో గేమ్స్ ఆడాడు. అయితే ఆ గేమ్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు లక్షల రూపాయలు స్వాహా చేశారు. హైదరాబాద్‌లో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. మన మొబైల్స్‌లో ఉండే నెట్ బ్యాకింగ్ వివరాలు తెలుసుకొని.. మొబైల్ గేమ్స్ ద్వారా డబ్బులు స్వాహా చేస్తున్న ఒక ముఠా వ్యవహారం బయటపడింది. హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్ పల్లికి చెందిన ఒక రిటైర్డ్ సబ్ ఇన్స్‌పెక్టర్ తన ఖాతాలో నుంచి రూ. […]

మొబైల్‌లో గేమ్స్ ఆడుతున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పోవచ్చు
X

బ్యాంకు వ్యవహారాలే తెలియని ఒక పిల్లవాడు తన తాత మొబైల్‌లో గేమ్స్ ఆడాడు. అయితే ఆ గేమ్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు లక్షల రూపాయలు స్వాహా చేశారు. హైదరాబాద్‌లో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. మన మొబైల్స్‌లో ఉండే నెట్ బ్యాకింగ్ వివరాలు తెలుసుకొని.. మొబైల్ గేమ్స్ ద్వారా డబ్బులు స్వాహా చేస్తున్న ఒక ముఠా వ్యవహారం బయటపడింది. హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్ పల్లికి చెందిన ఒక రిటైర్డ్ సబ్ ఇన్స్‌పెక్టర్ తన ఖాతాలో నుంచి రూ. 15 లక్షలు మాయం అయినట్లు గుర్తించాడు. రిటైర్ అయ్యాక వచ్చిన బెనిఫిట్స్ రూ. 17 లక్షలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో జమ చేశారు. కాగా, జూలై 17న తన ఖాతాలో బ్యాలెన్స్ చూడగా అందులో కేవలం రూ. 1.28 లక్షలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఖంగు తిన్న రిటైర్డ్ ఎస్ఐ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఆ ఫిర్యాదుపై విచారణ చేస్తుండగానే.. బాధితుడి కూతురు ఖాతాలో నుంచి కూడా రూ. 50 వేలు మాయం అయ్యాయి. దీంతో ఇది తెలిసిన వాళ్ల పనే అయ్యుంటుందనే అనుమానంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అయితే ఇద్దరి మొబైల్స్ పరిశీలించగా.. ‘ఫ్రీ ఫైర్’ అనే గేమ్ కనపడింది. ఆ గేమ్‌ను బాధితుడి మనుమడు తరచూ ఆడుతుంటాడు. ఈ మొబైల్ గేమ్ ద్వారా డబ్లులు కొల్లగొట్టినట్లు తేలింది. ముంబాయికి చెందిన ముఠా ఇలా గేమ్స్ ద్వారా డబ్బులు కొల్లగొడుతున్నట్లు గుర్తించారు.

మొబైల్ గేమ్స్ ఆడే సమయంలో అదనంగా డబ్బులు చెల్లిస్తే తర్వాతి లెవెల్‌కు వెళ్లడం లేదా కొత్తగా ఆయుధాలు సమకూర్చుకోవడం వంటివి చేయవచ్చు. అయితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ‘నో’ అని నొక్కినా.. ‘ఎస్’ అని వచ్చేలా గేమ్స్ సెట్ చేశారు. ఇలా బాధితుడి మనుమడు నో అని క్లిక్ చేసినా.. ప్రతీ సారి నెట్ బ్యాంకింగ్ నుంచి డబ్బులు స్వాహా చేశారు. దీనికి సంబంధించిన ముఠా ముంబైలో ఉండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అనవసరమైన మొబైల్ గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఆడవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

First Published:  21 Aug 2021 2:14 AM GMT
Next Story