Telugu Global
Cinema & Entertainment

తుపాకీ పట్టిన భీమ్లా నాయక్

“యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు. యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు. నాయకుడు ఈ రెండింటినీ తన భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు.!” భీమ్లా నాయక్ నుంచి ఓ వీడియో వచ్చింది. ఆ వీడియో చివరలో కనిపించే వాక్యాలివి. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించి పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. సందర్భోచితంగా ఈ దృశ్యాలను ఇలా అక్షర బద్ధం చేసింది చిత్రం యూనిట్. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా […]

తుపాకీ పట్టిన భీమ్లా నాయక్
X

“యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు. యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి
ప్రకృతికి వత్తాసు పలుకుతాడు. నాయకుడు ఈ రెండింటినీ తన భుజాన మోసుకుంటూ ముందుకు
కదుల్తాడు.!”

భీమ్లా నాయక్ నుంచి ఓ వీడియో వచ్చింది. ఆ వీడియో చివరలో కనిపించే వాక్యాలివి. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించి పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. సందర్భోచితంగా ఈ దృశ్యాలను ఇలా అక్షర బద్ధం చేసింది చిత్రం యూనిట్.

సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ఈ చిత్రం షూటింగ్ విరామంలో పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించింది చిత్రం యూనిట్. వీటిని షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’ అంటూ విడుదల చేశారు.

ఈ చిత్రం లోని ఫస్ట్ సాంగ్ ను సెప్టెంబర్ 2 న విడుదల చేయబోతున్నారు. సినిమాను సంక్రాంతి కానుకగా
జనవరి 12న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

First Published:  21 Aug 2021 6:51 AM GMT
Next Story