Telugu Global
Cinema & Entertainment

జీ తెలుగు చేతికి కేజీఎఫ్ ఛాప్టర్-2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘కే.జీ.ఎఫ్ ఛాప్టర్-1’ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. మాస్ ఫైటింగులు, అద్భుతమైన సెట్టింగులు, భారీగా ఎలివేషన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ప్రతీ అంశం యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అద్భుతమైన క్లైమాక్స్ తో ముగిసిన ఈ సినిమా తదుపరి కథ ‘కే.జీ.ఎఫ్ ఛాప్టర్-2’ లో తెలియనుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. […]

కేజీఎఫ్
X

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘కే.జీ.ఎఫ్
ఛాప్టర్-1’ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. మాస్ ఫైటింగులు, అద్భుతమైన సెట్టింగులు, భారీగా ఎలివేషన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ప్రతీ అంశం యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అద్భుతమైన క్లైమాక్స్ తో ముగిసిన ఈ సినిమా తదుపరి కథ ‘కే.జీ.ఎఫ్ ఛాప్టర్-2’ లో తెలియనుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడీ సినిమాకు సంబంధించి భారీ డీల్ లాక్ అయింది. జీ గ్రూప్ సంస్థ ఈ సినిమా శాటిలైట్ రైట్స్
దక్కించుకుంది. అది కూడా దక్షిణాది భాషలకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ తీసుకుంది. అంటే.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కేజీఎఫ్-2 శాటిలైట్ రైట్స్ జీ గ్రూప్ వశమయ్యాయి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఈ సినిమా సౌత్ శాటిలైట్ రైట్స్ డీల్ 50 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ చాన్నాళ్ల కిందటే అమ్ముడుపోయాయి. ఛాప్టర్-2 సెట్స్ పైకి
రాకముందే అమెజాన్ సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది.

యష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కేజీఎఫ్2 సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి బాలీవుడ్
స్టార్స్ నటిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సాగుతోంది. త్వరలోనే విడుదల
తేదీని ప్రకటిస్తారు.

First Published:  20 Aug 2021 8:48 AM GMT
Next Story