Telugu Global
Cinema & Entertainment

నితిన్ మాస్ట్రో మూవీ ట్రయిలర్ రెడీ

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నితిన్ 30వ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగ‌స్ట్ 23, సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలియ‌జేస్తూ మేక‌ర్స్.. నితిన్‌, న‌భా న‌టేశ్‌, త‌మ‌న్నా భాటియా ఉన్నపోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల‌ర్‌గా రూపొందుతున్న `మాస్ట్రో` చిత్రంలో నభా నటేశ్, తమన్నాలతో కలిసి తొలిసారి నటించాడు హీరో నితిన్‌. […]

నితిన్ మాస్ట్రో మూవీ ట్రయిలర్ రెడీ
X

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నితిన్ 30వ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగ‌స్ట్ 23, సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలియ‌జేస్తూ మేక‌ర్స్.. నితిన్‌, న‌భా న‌టేశ్‌, త‌మ‌న్నా భాటియా ఉన్నపోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల‌ర్‌గా రూపొందుతున్న 'మాస్ట్రో' చిత్రంలో నభా నటేశ్, తమన్నాలతో కలిసి తొలిసారి నటించాడు హీరో నితిన్‌. నభా నటేశ్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తే, త‌మ‌న్నా విలన్ పాత్ర‌లో
క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ లో హిట్టయిన అంధాధూన్ సినిమాకు రీమేక్ గా వస్తున్న మాస్ట్రోకు మేర్ల‌పాక
గాంధీ దర్శకుడు.

డిస్నీ హాట్ స్టార్ సంస్థ ఈ సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ రైట్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ట్రయిలర్ రిలీజ్ తో పాటు స్ట్రీమింగ్ డేట్ ను ఆ సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

First Published:  20 Aug 2021 8:44 AM GMT
Next Story