Telugu Global
NEWS

వరి రైతులకు అండగా ఏపీ ప్రభుత్వం.. రాయితీతో వరి కోత మెషీన్ల పంపిణీ..

ఏపీలో సాగవుతున్న పంటల్లో ప్రథమ స్థానం వరిదే. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో వరి సాగు విస్తారంగా ఉంది. రాయలసీమలోని కేసీ కెనాల్ పరిధిలో కూడా వరి సాగు ఎక్కువే. రాష్ట్రంలో ఏటా విస్తీర్ణంలో దాదాపు 60 శాతం తూర్పు,పశ్చిమ గోదావరి,కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే సాగవుతోంది. అయితే వరి సాగు దాదాపు అందరూ ఒకేసారి ప్రారంభిస్తారు. కోతలు కూడా ఒకేసారి ఉంటాయి. దీంతో ఆ సమయంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. వరి కోతకు మెషీన్లు కూడా పెద్ద […]

వరి రైతులకు అండగా ఏపీ ప్రభుత్వం.. రాయితీతో వరి కోత మెషీన్ల పంపిణీ..
X

ఏపీలో సాగవుతున్న పంటల్లో ప్రథమ స్థానం వరిదే. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో వరి సాగు విస్తారంగా ఉంది. రాయలసీమలోని కేసీ కెనాల్ పరిధిలో కూడా వరి సాగు ఎక్కువే. రాష్ట్రంలో ఏటా విస్తీర్ణంలో దాదాపు 60 శాతం తూర్పు,పశ్చిమ గోదావరి,కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే సాగవుతోంది. అయితే వరి సాగు దాదాపు అందరూ ఒకేసారి ప్రారంభిస్తారు. కోతలు కూడా ఒకేసారి ఉంటాయి. దీంతో ఆ సమయంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. వరి కోతకు మెషీన్లు కూడా పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండటం లేదు. దీంతో రైతులు పక్క రాష్ట్రాల నుంచి మెషీన్లు తెప్పించి కోతలు కోయిస్తున్నారు. దీనివల్ల సాగులో పెట్టుబడి వ్యయం అధికమవుతోంది.

ఈ సమస్యను దృష్టిలో పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం వరి రైతులకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రాయితీతో వరి కోత మెషీన్లను పంపిణీ చేయనుంది. ముగ్గురు రైతులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మెషీన్లను రాయితీతో అందించనుంది.ప్రస్తుతం మండలానికి ఐదు రైతు సంఘాలను ఏర్పాటు చేసి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

సంఘాల్లోని రైతులకు ప్రభుత్వం వరి కోత యంత్రాల కొనుగోలుకు 40 శాతం రాయితీగా రూ. 10 లక్షలు ఇస్తుంది. బ్యాంకు రుణం ద్వారా మరో రూ.12.30లక్షల రుణం ఇప్పిస్తుంది. లబ్ధిదారులు యంత్రాల కొనుగోలులో 10% మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. వరి కోతకు ప్రభుత్వం నిర్దేశించిన ధరల మేరకు యంత్ర సేవా కేంద్రాలు వసూలు చేయాల్సి ఉంటుంది.

ఈ నాలుగు జిల్లాల్లో డిసెంబర్ ఆఖరులోగా 500 యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత క్రమేణా ఈ కేంద్రాల సంఖ్య పెంచనుంది. ఈ పథకం విజయవంతం అయితే రాష్ట్రంలోని మరి కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటు ద్వారా గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

First Published:  18 Aug 2021 2:56 AM GMT
Next Story