Telugu Global
Cinema & Entertainment

పెద్దగా కష్టపడలేదన్న హీరో

27న రిలీజ్ కాబోతోంది శ్రీదేవి సోడా సెంటర్. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగా యూనిట్ అంతా కలిసి టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. హీరో సుధీర్ బాబు కూడా ఇందులో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు సుధీర్ బాబు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కోసం సుధీర్ బాబు పెద్దగా కష్టపడలేదంట. మరీ ముఖ్యంగా నటించడానికి అస్సలు ఇబ్బంది పడలేదంట. దీనికి […]

పెద్దగా కష్టపడలేదన్న హీరో
X

27న రిలీజ్ కాబోతోంది శ్రీదేవి సోడా సెంటర్. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగా యూనిట్ అంతా కలిసి టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. హీరో సుధీర్ బాబు కూడా ఇందులో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు సుధీర్ బాబు.

శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కోసం సుధీర్ బాబు పెద్దగా కష్టపడలేదంట. మరీ ముఖ్యంగా నటించడానికి
అస్సలు ఇబ్బంది పడలేదంట. దీనికి కారణం సినిమాలో సూరిబాబు పాత్ర చాలా క్లారిటీగా ఉండడమే అని
చెబుతున్నాడు సుధీర్ బాబు. దర్శకుడు కరుణకుమార్ తన పాత్రకు చాలా చక్కగా డిజైన్ చేశాడని, దీంతో
తనకు రీసెర్చ్ చేయడానికి, నటించడానికి పెద్దగా అవకాశం లేకుండా పోయిందంటున్నాడు.

అయితే సినిమా కోసం శారీరకంగా మాత్రం బాగా కష్టపడ్డాడట సుధీర్ బాబు. ఓ ఫిజిక్ తో కొంత షూట్ పూర్తయిన తర్వాత.. అదే పోర్షన్ ను ఆఖరి షెడ్యూల్ లో షూట్ చేశారని.. దాని కోసం నెలల పాటు ఒకే ఫిజిక్ ను మెయింటైన్ చేయడం చాలా కష్టమైందని చెప్పుకొచ్చాడు.

First Published:  17 Aug 2021 10:00 AM GMT
Next Story