Telugu Global
Cinema & Entertainment

తననుతాను కవర్ చేసుకున్న విశ్వక్

రీసెంట్ గా హీరో విశ్వక్ సేన్ చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తను నటించిన పాగల్ సినిమాతో, మూసేసిన థియేటర్లన్నీ తెరుచుకుంటాయని, సినిమా సూపర్ హిట్ అవుతుందని ప్రకటించాడు విశ్వక్. అక్కడితో ఆగకుండా సినిమా హిట్టవ్వకపోతే, పేరు మార్చుకుంటానంటూ కాస్త ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు. కట్ చేస్తే సినిమా ఫ్లాప్ అయింది. అయితే విశ్వక్ మాత్రం తన సినిమా హిట్ అంటున్నాడు. “చాలా మంది నేను పేరు ఎప్పుడు మార్చుకుంటానా అని చూస్తున్నారు. కానీ […]

తననుతాను కవర్ చేసుకున్న విశ్వక్
X

రీసెంట్ గా హీరో విశ్వక్ సేన్ చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తను నటించిన
పాగల్ సినిమాతో, మూసేసిన థియేటర్లన్నీ తెరుచుకుంటాయని, సినిమా సూపర్ హిట్ అవుతుందని
ప్రకటించాడు విశ్వక్. అక్కడితో ఆగకుండా సినిమా హిట్టవ్వకపోతే, పేరు మార్చుకుంటానంటూ కాస్త ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు. కట్ చేస్తే సినిమా ఫ్లాప్ అయింది. అయితే విశ్వక్ మాత్రం తన సినిమా హిట్
అంటున్నాడు.

“చాలా మంది నేను పేరు ఎప్పుడు మార్చుకుంటానా అని చూస్తున్నారు. కానీ ఈ సినిమా హిట్ తో నా నమ్మకం నిజమైంది, నా నమ్మకం వమ్ము కాదని మ రోసారి ప్రూవ్ చేసారు ప్రేక్షకులు. ఇప్పుడు నేను పేరు
మార్చుకోవలసిన అవసరం లేదు . నేను హీరోగా చేసిన హిట్ సినిమా ‘హిట్’ కలెక్షన్స్ కంటే పాగల్ కలక్షన్స్ 40% ఎక్కువ వచ్చాయి. నాకు, ఆడియన్స్ కి మధ్యలో ఎవరు లేరు. ఈ సినిమాతో నాకు ఆడియెన్స్ తప్ప ఎవరూ లేరని అర్థం అయింది. శని, ఆది 6.5 కోట్ల గ్రాస్ కొట్టింది సినిమా. సింగిల్ స్క్రీన్స్ ఊగిపోతున్నాయి.. ఇంతకంటే ప్రూఫ్ ఏమి కావాలి.”

ఇలా గతంలో తను చేసిన వివాదాస్పద కామెంట్ ను కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు విశ్వక్ సేన్.
ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆక్యుపెన్సీ నిబంధనల మధ్య తన సినిమా పెద్ద హిట్ అయిందని చెబుతున్నాడు.

First Published:  16 Aug 2021 10:07 AM GMT
Next Story