Telugu Global
Cinema & Entertainment

గోవాలో పని పూర్తిచేసిన రాజు

విభిన్నమైన థ్రిల్లర్ ‘డర్టీ హరి’ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మెగా మేకర్ ఎం.ఎస్ రాజు, ‘7 డేస్ 6 నైట్స్’ లాంటి యూత్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తూ, కరోనా నియమాల కఠినంగా అమలవుతున్న గోవా లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో, 4 కామెరాలతో ‘7 డేస్ 6 నైట్స్’ ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరించారు డైరెక్టర్ ఎమ్మెస్ రాజు. తరువాతి షెడ్యూల్ కోసం మంగళూరు మరియు ఉడుపికి వెళుతున్న […]

గోవాలో పని పూర్తిచేసిన రాజు
X

విభిన్నమైన థ్రిల్లర్ ‘డర్టీ హరి’ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మెగా మేకర్ ఎం.ఎస్ రాజు, ‘7 డేస్ 6 నైట్స్’ లాంటి యూత్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తూ, కరోనా నియమాల కఠినంగా అమలవుతున్న గోవా లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో, 4 కామెరాలతో ‘7 డేస్ 6 నైట్స్’ ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరించారు డైరెక్టర్ ఎమ్మెస్ రాజు.

తరువాతి షెడ్యూల్ కోసం మంగళూరు మరియు ఉడుపికి వెళుతున్న మూవీ టీం, అతి త్వరలో చిత్రాన్ని
విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ సినిమాతో ఏకంగా 16 మంది కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి
పరిచయం చేస్తున్నారు రాజు. వీరిలో 16 ఏళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి కూడా ఉన్నాడు.

ఒక వైపు చిత్రీకరణ చివరి దశలో ఉండగా మరోవైపు నిర్మాణంతర కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఇటు
షూట్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ ను ఒకేసారి పూర్తిచేసి, త్వరలోనే రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  16 Aug 2021 10:05 AM GMT
Next Story