Telugu Global
Cinema & Entertainment

ఇప్పుడేం చేద్దాం చెప్పు విశ్వక్ సేన్..!

విడుదలకు ముందు చాలా చెప్పాడు. సినిమా సక్సెస్ అవ్వకపోతే ఏకంగా పేరు మార్చుకుంటానన్నాడు. కట్ చేస్తే పాగల్ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో హీరో విశ్వక్ సేన్ నెటిజన్లకు టార్గెట్ అయ్యాడు. ఇప్పుడంతా అతడ్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలకు పూర్తి బాధ్యుడు విశ్వక్. ట్రోలింగ్ కు ఆస్కారం ఇచ్చింది అతడు. ప్రచారం పలు రకాలు. కానీ విశ్వక్ చేసిన అతి ప్రచారం మాత్రం తగదు. తమ సినిమాపై మేకర్స్ కు, హీరోకు చాలా నమ్మకం ఉండొచ్చు. కానీ వాళ్లకు […]

ఇప్పుడేం చేద్దాం చెప్పు విశ్వక్ సేన్..!
X

విడుదలకు ముందు చాలా చెప్పాడు. సినిమా సక్సెస్ అవ్వకపోతే ఏకంగా పేరు మార్చుకుంటానన్నాడు. కట్ చేస్తే పాగల్ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో హీరో విశ్వక్ సేన్ నెటిజన్లకు టార్గెట్ అయ్యాడు. ఇప్పుడంతా అతడ్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలకు పూర్తి బాధ్యుడు విశ్వక్. ట్రోలింగ్ కు ఆస్కారం ఇచ్చింది అతడు.

ప్రచారం పలు రకాలు. కానీ విశ్వక్ చేసిన అతి ప్రచారం మాత్రం తగదు. తమ సినిమాపై మేకర్స్ కు, హీరోకు చాలా నమ్మకం ఉండొచ్చు. కానీ వాళ్లకు నమ్మకం ఉంటే సరిపోదు. ప్రేక్షకుల తీర్పు అంతిమం. అందుకే నూటికి 99 మంది హీరోలు తమ ప్రాజెక్టుపై ఎంత నమ్మకం ఉన్నప్పటికీ అతి ప్రకటనలు మాత్రం చేయరు. హద్దుల్లోనే సినిమా గురించి మాట్లాడుతుంటారు.

ఈ విషయంలో విశ్వక్ సేన్ మాటలు కోటలు దాటాయి. అతడి అంచనా తప్పయింది. ఇలాంటప్పుడే వ్యక్తులు ఇబ్బందులు పడతారు. విశ్వక్ ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఫేస్ చేస్తున్నాడు. ఒకరిద్దరు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ను ఆధారంగా చేసుకొని.. తన సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ ఓపెన్ అవుతాయని, అలా అవ్వకపోతే పేరు మార్చుకుంటానని ప్రకటించేశాడు విశ్వక్. ఇప్పుడు దానికి ఫలితం అనుభవిస్తున్నాడు. అయిందేదో అయిపోయింది. ఇకనైనా విశ్వక్ ఇలాంటి కోటలు దాటే మాటలు తగ్గించుకుంటే మంచిది.

First Published:  15 Aug 2021 10:34 AM GMT
Next Story