Telugu Global
Cinema & Entertainment

గల్లీ రౌడీ రిలీజ్ డేట్ ఫిక్స్

కరోనా స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మై థ్రిల్ల‌ర్స్‌, హార‌ర్‌, స‌స్పెన్స్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌ను ఎక్కువ‌గా చూసిన ఆడియెన్స్ ఓ ప‌క్కా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేయాల‌ని అనుకుంటారు. అలాంటి న‌వ్వుల విందు భోజ‌నాన్ని అందించ‌డానికి సెప్టెంబ‌ర్ 3న ‘గ‌ల్లీరౌడీ’ వ‌చ్చేస్తున్నాడు. నవ్వుల దాడికి సిద్ధమవండనే విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. రైట‌ర్ కోన వెంక‌ట‌్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా […]

గల్లీ రౌడీ రిలీజ్ డేట్ ఫిక్స్
X

కరోనా స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మై థ్రిల్ల‌ర్స్‌, హార‌ర్‌, స‌స్పెన్స్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌ను ఎక్కువ‌గా
చూసిన ఆడియెన్స్ ఓ ప‌క్కా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేయాల‌ని అనుకుంటారు. అలాంటి న‌వ్వుల విందు భోజ‌నాన్ని అందించ‌డానికి సెప్టెంబ‌ర్ 3న ‘గ‌ల్లీరౌడీ’ వ‌చ్చేస్తున్నాడు. నవ్వుల దాడికి సిద్ధమవండనే విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. రైట‌ర్ కోన వెంక‌ట‌్ ‘గల్లీ రౌడీ’
చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ చేయగా.. కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు.

ఇష్ట‌ప‌డ్డ అమ్మాయిని సొంతం చేసుకోవ‌డానికి తానొక పెద్ద రౌడీన‌ని బిల్డ‌ప్ ఇచ్చిన ఓ యువ‌కుడు.. దాని కోసం ఎలాంటి పాట్లు ప‌డ్డాడు. ఆ క్ర‌మంలో ఎలాంటి కామెడీ క్రియేట్ అయ్యింద‌నే అంశంపై ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘గ‌ల్లీరౌడీ’ ప్రేక్ష‌కుల ముందుకు సెప్టెంబ‌ర్ 3న రాబోతున్నాడు.

First Published:  15 Aug 2021 10:30 AM GMT
Next Story