Telugu Global
Cinema & Entertainment

ఇంత ఓవరాక్షన్ అవసరమా "పాగల్"

తమ సినిమాకు ప్రచారం కల్పించడంలో భాగంగా హీరోలు, మేకర్స్ రకరకాల స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు. తమ కథ చాలా కొత్తగా ఉంటుందని కొందరంటే, ఇప్పటివరకు తెలుగుతెరపై రాలేదని మరికొందరంటారు. సినిమాలో ట్విస్టులు అదిరిపోతాయని ఇంకొందరంటారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ఓవరాక్షన్ చేస్తుంటారు కూడా. హీరో విశ్వక్ సేన్ ఈ రెండో రకం. పాగల్ అనే సినిమా చేశాడు ఈ హీరో. శనివారం థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. అందరూ సినిమా […]

ఇంత ఓవరాక్షన్ అవసరమా పాగల్
X

తమ సినిమాకు ప్రచారం కల్పించడంలో భాగంగా హీరోలు, మేకర్స్ రకరకాల స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు. తమ కథ చాలా కొత్తగా ఉంటుందని కొందరంటే, ఇప్పటివరకు తెలుగుతెరపై రాలేదని మరికొందరంటారు.
సినిమాలో ట్విస్టులు అదిరిపోతాయని ఇంకొందరంటారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ఓవరాక్షన్
చేస్తుంటారు కూడా. హీరో విశ్వక్ సేన్ ఈ రెండో రకం.

పాగల్ అనే సినిమా చేశాడు ఈ హీరో. శనివారం థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. అందరూ సినిమా గురించి గొప్పగా చెప్పారు. విశ్వక్ సేన్ మాత్రం మరో అడుగు ముందుకేశాడు. కాస్త అతిగా మాట్లాడాడు. పాగల్ సినిమాతో లాక్ డౌన్ తో మూతపడిన థియేటర్లన్నీ
తెరుచుకుంటాయన్నాడు విశ్వక్. ఇక్కడితో ఆగితే పర్లేదు. అలా తెరుచుకోకపోతే తన పేరు
మార్చుకుంటానంటూ నిండు సభలో సవాల్ విసిరాడు. ఇదే కాస్త అతిగా అనిపించింది అందరికీ.

ఇప్పటికే విశ్వక్ తన పేరు మార్చుకున్నాడు. అతడి అసలు పేరు విశ్వక్ కాదు. సినిమాల కోసం పేరు
మార్చుకున్నాడు. ఇప్పుడు తన ఛాలెంజ్ వికటించి, సినిమా ఫ్లాప్ అయి, థియేటర్లు తెరుచుకోకపోతే మరోసారి పేరు మార్చుకుంటావా అంటూ సోషల్ మీడియాలో అతడిపై సెటైర్లు పడుతున్నాయి.

గతంలో డియర్ కామ్రేడ్ టైమ్ లో విజయ్ దేవరకొండ కూడా ఇలానే ప్రచారంలో కాస్త ఓవర్ చేశాడు. అప్పుడు విజయ్ చేసిన అతిని, విశ్వక్ డైలాగ్స్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ పడుతున్నాయి. విశ్వక్ కాస్త ఆచితూచి మాట్లాడాల్సిందంటూ మరికొంతమంది పద్ధతిగా ట్రోల్ చేస్తున్నారు.

First Published:  12 Aug 2021 8:10 AM GMT
Next Story