Telugu Global
National

బెంగళూరులో థర్డ్ వేవ్ భయం.. చిన్నారులకు కోవిడ్..

కరోనా థర్డ్ వేవ్ చిన్నారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందన్న వ్యవహారంపై ఇంకా తల్లిదండ్రుల్లో పలు అనుమానాలున్నాయి. ఓ దశలో ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు సైతం చిన్నారులపై థర్డ్ వేవ్ పంజా అనేది వట్టి పుకారేనని తేల్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తల్లిదండ్రుల్లో భయాందోళనలు రెట్టింపవుతున్నాయి. ఈనెల 2నుంచి పంజాబ్ లో స్కూల్స్ పునఃప్రారంభం అయ్యాయి. లూథియానాలో 20మంది స్టూడెంట్స్ కి కరోనా సోకడంతో స్థానిక అధికారులు అలర్ట్ అయ్యారు. కోవిడ్ బారినపడ్డ పిల్లలందర్నీ హోమ్ ఐసోలేషన్లో […]

బెంగళూరులో థర్డ్ వేవ్ భయం.. చిన్నారులకు కోవిడ్..
X

కరోనా థర్డ్ వేవ్ చిన్నారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందన్న వ్యవహారంపై ఇంకా తల్లిదండ్రుల్లో పలు అనుమానాలున్నాయి. ఓ దశలో ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు సైతం చిన్నారులపై థర్డ్ వేవ్ పంజా అనేది వట్టి పుకారేనని తేల్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తల్లిదండ్రుల్లో భయాందోళనలు రెట్టింపవుతున్నాయి.

ఈనెల 2నుంచి పంజాబ్ లో స్కూల్స్ పునఃప్రారంభం అయ్యాయి. లూథియానాలో 20మంది స్టూడెంట్స్ కి కరోనా సోకడంతో స్థానిక అధికారులు అలర్ట్ అయ్యారు. కోవిడ్ బారినపడ్డ పిల్లలందర్నీ హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్కూళ్లను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయించి వారం రోజులు సెలవు ప్రకటించారు. తాజాగా కర్నాటకలో వెలుగులోకి వచ్చిన కోవిడ్ కేసులు మరింత భయాందోళనలకు కారణం అవుతున్నాయి. బెంగళూరులో గత 5 రోజుల వ్యవధిలో 242 మంది చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు. వీరంతా 19 సంవత్సరాల లోపు వయసువారు కావడం విశేషం. వీరిలో 9 ఏళ్లలోపు వారు 106మంది ఉన్నారు. ఈ మేరకు ముంబై కార్పొరేషన్ అధికారిక సమాచారాన్ని విడుదల చేసింది.

కోవిడ్ థర్డ్‌ వేవ్‌ వస్తే చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఇలా తక్కువ వ్యవధిలో వందల మంది చిన్నారులు కోవిడ్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చిన్నారులను ఇళ్లలో ఉంచాలని తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అటు లూథియానా, ఇటు బెంగళూరు ఉదాహరణతో మిగతా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వాలు తల్లిదండ్రుల్ని అప్రమత్తం చేస్తున్నాయి. చాలా చోట్ల స్కూళ్లు తెరిచేందుకు రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం విద్యాసంస్థల పునఃప్రారంభాన్ని సెప్టెంబర్ కు వాయిదా వేశాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుతున్నవేళ, చిన్నారుల్లో ఎక్కువమంది వైరస్ బారిన పడుతున్నారనే వార్తలు ఆందోళనకు కారణం అవుతున్నాయి.

Next Story