Telugu Global
NEWS

టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్..!

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ఖరారైంది. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ కీలక నేత ఈటల రాజేందర్ ను ప్రభుత్వం క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా […]

టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్..!
X

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ఖరారైంది. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ కీలక నేత ఈటల రాజేందర్ ను ప్రభుత్వం క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

దీంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల్లో ఈటలను ధీటుగా ఎదుర్కొనే నేత కోసం టిఆర్ఎస్ అధిష్టానం అన్వేషించింది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్వర్గం రవి, వకుళాభరణం, వీరేశన్, కృష్ణ మోహన్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి, టీడీపీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పు కున్న ఎల్.రమణ పేర్లు వినిపించాయి.

అయితే అనూహ్యంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. శ్రీనివాస్ హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడం, బీసీ కులానికి చెందిన వ్యక్తి కావడం, రాజకీయ నేపథ్యం కూడా ఉండడంతో ఆయననే టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అలాగే ఉన్నత విద్యావంతుడు కావడంతో ఆయన వైపే కేసీఆర్ మొగ్గుచూపారు.

First Published:  11 Aug 2021 3:02 AM GMT
Next Story