Telugu Global
Cinema & Entertainment

పెద్ద దొంగగా మారబోతున్న బెల్లంకొండ

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు బెల్లంకొండ. ఇప్పటికే హిందీలో ఛత్రపతి రీమేక్ ను స్టార్ట్ చేసిన ఈ హీరో.. తమిళ్ లో సూపర్ హిట్టయిన కర్నన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టును ఎనౌన్స్ చేశాడు బెల్లంకొండ. అదే టైగర్ నాగేశ్వరరావు బయోపిక్. `స్టూవ‌ర్టుపురం దొంగ‌` పేరుతో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. 1970 కాలంలో స్టూవ‌ర్టుపురం ప్రాంతానికి చెందిన […]

పెద్ద దొంగగా మారబోతున్న బెల్లంకొండ
X

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు బెల్లంకొండ. ఇప్పటికే హిందీలో ఛత్రపతి రీమేక్ ను స్టార్ట్
చేసిన ఈ హీరో.. తమిళ్ లో సూపర్ హిట్టయిన కర్నన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ఈ
రెండు సినిమాలు కాకుండా, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టును ఎనౌన్స్ చేశాడు బెల్లంకొండ. అదే టైగర్
నాగేశ్వరరావు బయోపిక్.

'స్టూవ‌ర్టుపురం దొంగ‌' పేరుతో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. 1970 కాలంలో స్టూవ‌ర్టుపురం ప్రాంతానికి చెందిన ప్ర‌ముఖ గ‌జ‌దొంగ 'టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు' బ‌యోపిక్ ఇది. నాగేశ్వ‌ర‌రావు త‌న జీవిత కాలంలో పోలీసుల నుంచి జైళ్ల నుంచి ఎన్నోసార్లు చాకచాక్యంగా త‌ప్పించుకున్నాడు. చెన్నై జైలు నుంచి నాగేశ్వ‌ర‌రావు త‌ప్పించుకున్న తీరుతో ఆయ‌న‌కు 'టైగ‌ర్‌' అనే పేరు వ‌చ్చింది. పోలీసుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టిన ఈ దొంగ 1987లో పోలీసుల కాల్పుల్లో మ‌ర‌ణించాడు. ఈ విష‌యాల‌తో 'స్టూవ‌ర్టుపురం దొంగ‌' సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు.

ఈ చిత్రంతో కె.ఎస్‌. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో సీనియ‌ర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ నిర్మాతగా త‌న ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తూ నిర్మాత‌గా క‌మ్‌బ్యాక్ అవుతున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  11 Aug 2021 6:54 AM GMT
Next Story