Telugu Global
Cinema & Entertainment

విశ్వక్ సేన్ పాగల్ ట్రయిలర్ రివ్యూ

పాగల్ ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే హీరోహీరోయిన్లు ఇంటర్వ్యూలు షురూ చేశారు. ఎవరికివారు విడివిడిగా వివిధ సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడీ ప్రమోషన్ ను ట్రయిలర్ తో నెక్ట్స్ స్టేజ్ కు తీసుకెళ్లారు మేకర్స్. కొద్దిసేపటి కిందట పాగల్ ట్రయిలర్ రిలీజైంది. పాగల్ సినిమాలో హీరో ప్రేమ కోసం పరితపించే రోమియోగా కనిపించబోతున్నాడనే విషయం టీజర్ లోనే స్పష్టమైంది. అదే అంశాన్ని ట్రయిలర్ లో ఇంకాస్త డీటెయిల్డ్ గా చూపించారు. అమ్మాయి అయితే చాలు, ఐ లవ్ […]

విశ్వక్ సేన్ పాగల్ ట్రయిలర్ రివ్యూ
X

పాగల్ ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే హీరోహీరోయిన్లు ఇంటర్వ్యూలు షురూ చేశారు. ఎవరికివారు
విడివిడిగా వివిధ సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడీ ప్రమోషన్ ను ట్రయిలర్ తో నెక్ట్స్ స్టేజ్ కు తీసుకెళ్లారు మేకర్స్. కొద్దిసేపటి కిందట పాగల్ ట్రయిలర్ రిలీజైంది.

పాగల్ సినిమాలో హీరో ప్రేమ కోసం పరితపించే రోమియోగా కనిపించబోతున్నాడనే విషయం టీజర్ లోనే
స్పష్టమైంది. అదే అంశాన్ని ట్రయిలర్ లో ఇంకాస్త డీటెయిల్డ్ గా చూపించారు. అమ్మాయి అయితే చాలు, ఐ లవ్ చెప్పేయడానికి రెడీ అయిపోతాడు హీరో. చివరికి హీరో పక్కనున్న కమెడియన్ కూడా కామెడీ చేస్తాడు. కరోనాను కూడా భరించొచ్చు కానీ, కరువుతో అల్లాడిపోతున్న ఇలాంటి వ్యక్తిని భరించడం సాధ్యం కాదంటాడు.

అలా లవర్ కోసం పరితపించే హీరోకు హీరోయిన్ ఎదురవుతుంది. అప్పుడు అసలైన ప్రేమకు అర్థం
తెలుసుకుంటాడు హీరో. హీరోయిన్ ప్రేమ కోసం చాలా కష్టపడతాడు. ఇంతకీ హీరోయిన్ తో హీరోకు ఎదురైన సమస్యలేంటి అనేది ఈ పాగల్ మూవీ.

ట్రయిలర్ లో ఏదీ దాచలేదు. సినిమా కథతో పాటు పాత్రలన్నింటినీ విడమర్చి చెప్పేశారు. క్లైమాక్స్ ట్విస్ట్
ఏంటనేది మాత్రం బ్యాలెన్స్. ఈనెల 14న థియేటర్లలోకి రాబోతున్నాడు పాగల్.

First Published:  10 Aug 2021 6:12 AM GMT
Next Story