Telugu Global
National

ఆఫీసులకు రాలేం.. ఇంటినుంచే పనిచేస్తాం..

కరోనా పరిచయం చేసిన కొత్త ట్రెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇటు కంపెనీ యాజమాన్యానికి ఖర్చు తగ్గించింది, అటు ఉద్యోగులకు కుటుంబ సభ్యులతో గడిపే అవకాశాన్నిచ్చింది. వెరసి ఉభయకుశలోపరిగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అందరికీ నచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమక్రమంగా చక్కబడుతున్న సందర్భంలో ఐటీ ఉద్యోగులందదిరి అభిప్రాయాలు కనుక్కునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. కంపెనీలు సుముఖంగా ఉన్నా, ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కల్చర్ ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఏడాదికి పైగా ఇంటినుంచే […]

ఆఫీసులకు రాలేం.. ఇంటినుంచే పనిచేస్తాం..
X

కరోనా పరిచయం చేసిన కొత్త ట్రెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇటు కంపెనీ యాజమాన్యానికి ఖర్చు తగ్గించింది, అటు ఉద్యోగులకు కుటుంబ సభ్యులతో గడిపే అవకాశాన్నిచ్చింది. వెరసి ఉభయకుశలోపరిగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అందరికీ నచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమక్రమంగా చక్కబడుతున్న సందర్భంలో ఐటీ ఉద్యోగులందదిరి అభిప్రాయాలు కనుక్కునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. కంపెనీలు సుముఖంగా ఉన్నా, ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కల్చర్ ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.

ఏడాదికి పైగా ఇంటినుంచే పనిచేయడానికి అలవాటు పడ్డ ఉద్యోగులు, ఇప్పటికిప్పుడు ఆఫీస్ లకు రావడానికి ఇష్టపడటం లేదు. ఈమేరకు కంపెనీలు చేపట్టిన సర్వేలో ఉద్యోగులు తమ విముఖతను తెలియజేస్తున్నారట. థర్డ్ వేవ్ భయాలున్నాయని, ఇప్పటిలాగే ఇంటినుంచే పని కొనసాగిస్తామని మెయిల్స్ పంపిస్తున్నారట. తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌ మెంట్‌ కౌన్సిల్‌ (టీఎఫ్‌ఎంసీ), ఇతర ఐటీ ఆధారిత సంఘాలు ఉద్యోగుల్ని తిరిగి కార్యాలయాలకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నా అవి విఫలమవుతున్నాయి. ఇటీవలె హైసియా(హైదరాబాద్‌ సాఫ్ట్‌ వేర్‌ ఎంటర్‌ ప్రైజెస్ అసోసియేషన్‌) చేసిన అధ్యయనంలోనూ ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపినట్లు తేలింది.

ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ కార్యాలయాల పనితీరు ఇదీ..
– 500 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న చిన్న సంస్థలు ఇప్పటికే 20 శాతం ఉద్యోగుల్ని కార్యాలయాలకు రప్పించాయి.
– ఓ మోస్తరు కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కేవలం 5శాతం ఉద్యోగుల్ని మాత్రమే ఆఫీస్ లకు రమ్మని చెబుతున్నాయి. మిగతా 95శాతం మంది ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఇలా దాదాపుగా 76శాతం సంస్థలు 9శాతం కంటే తక్కువ మంది ఉద్యోగులను ఆఫీస్ లకు పిలిపిస్తున్నాయి. మిగతా వారంతా వర్క్ ఫ్రమ్ హోమ్.
– థర్డ్ వేవ్ ముప్పు లేకపోతే.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి సగం మంది ఉద్యోగుల్ని ఆఫీస్ లకు పిలిపించే ఏర్పాట్లు చేస్తున్నాయి ఐటీ కంపెనీలు. కరోనా కష్టాలు తొలగిపోయినా కూడా ఉద్యోగుల్ని ఆఫీస్ లకు పిలిపించే అవకాశాలు లేవని, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్టే తమకు లాభదాయకంగా ఉందని 27శాతం సంస్థలు చెబుతున్నాయి.
– కరోనాకు ముందు 100మంది ఆఫీస్ లకు వస్తుంటే, ఇప్పుడు కేవలం ఆఫీస్ లో 10మంది ఉంటే చాలు, మిగతా 90మంది ఇంటినుంచే పనిచేస్తే మేలు అంటున్నాయి.
– వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. అప్పటికి దాదాపు 2 నుంచి 5 లక్షలమంది వరకు ఉద్యోగులు ఇల్లు వదలి కార్యాలయాలకు వచ్చే అవకాశముందని ఐటీ సంస్థల అధిపతులు చెబుతున్నారు.

అటు కంపెనీలు కూడా ఉద్యోగుల్ని ఆఫీస్ లకు రప్పించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కార్యాలయాల్లో పనిచేసే థర్డ్ పార్టీ సిబ్బందికి వ్యాక్కినేషన్ తప్పనిసరి చేస్తున్నాయి. సురక్షిత వాతావరణంలో ఉద్యోగులకు వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మన దగ్గర పాజిటివిటీ రేటు తగ్గింది కాబట్టి ప్రమాదం ఉండకపోవచ్చని యాజమాన్యాలు చెబుతున్నాయి. కానీ ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ కే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

First Published:  9 Aug 2021 4:26 AM GMT
Next Story