Telugu Global
NEWS

కర్నూలుకు న్యాయ రాజధాని తరలించే ప్రక్రియ ప్రారంభం..!

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో, శాసన రాజధాని అమరావతిలో, న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. న్యాయ రాజధానికి సంబంధించిన కార్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా లోకాయుక్త కార్యాలయం కోసం అధికారులు నిన్న కర్నూలులో పలు భవనాలను పరిశీలించారు. బళ్లారి చౌరస్తా, […]

కర్నూలుకు న్యాయ రాజధాని తరలించే ప్రక్రియ ప్రారంభం..!
X

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో, శాసన రాజధాని అమరావతిలో, న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. న్యాయ రాజధానికి సంబంధించిన కార్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా లోకాయుక్త కార్యాలయం కోసం అధికారులు నిన్న కర్నూలులో పలు భవనాలను పరిశీలించారు. బళ్లారి చౌరస్తా, సంతోష్ నగర్ లలో లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి స్వయంగా పలు భవనాలను పరిశీలించారు. కర్నూలులో ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఏపీలో మానవ హక్కుల కమిషన్, లోక్ అదాలత్ రాష్ట్ర కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి సంబంధించి గత నెలలోనే హెచ్ ఆర్సీ జ్యుడిషియల్ సభ్యుడు శ్రీనివాసరావు కర్నూలులో పర్యటించారు. స్థలాల పరిశీలనలో భాగంగా కలెక్టర్, జిల్లా అధికారులతో చర్చించారు. కర్నూలు నగరంలో పర్యటించి పలు భవనాలను పరిశీలించారు. నిన్న లోకాయుక్త కార్యాలయం కోసం జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి కూడా కర్నూలు లో పర్యటించడం తో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు పనులు ముమ్మరమైనట్లు అర్థమవుతోంది.

First Published:  9 Aug 2021 4:38 AM GMT
Next Story