Telugu Global
Cinema & Entertainment

పేరెంట్స్ కు ఆ ఛాన్స్ ఇవ్వను: కియరా

ప్రేమ, పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు హీరోయిన్లకు తరచుగా ఎదురవుతుంటాయి. వీటిపై ఒక్కో హీరోయిన్ ఒక్కో విధంగా స్పందిస్తుంది. తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారాల్లేవని చాలామంది హీరోయిన్లు చెబుతుంటారు. కానీ స్టార్ హీరోయిన్ కియరా అద్వానీ మాత్రం తను ప్రేమ వివాహమే చేసుకుంటానని చెబుతోంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు అస్సలు ఛాన్స్ ఇవ్వనంటోంది. పెద్దలు కుదిర్చిన సంబంధం కంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తనకు చాలా ఇష్టమని అంటోంది కియరా. ఇప్పటికే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేశానని, కాబట్టి తన పెళ్లి గురించి […]

పేరెంట్స్ కు ఆ ఛాన్స్ ఇవ్వను: కియరా
X

ప్రేమ, పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు హీరోయిన్లకు తరచుగా ఎదురవుతుంటాయి. వీటిపై ఒక్కో హీరోయిన్
ఒక్కో విధంగా స్పందిస్తుంది. తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారాల్లేవని చాలామంది హీరోయిన్లు చెబుతుంటారు. కానీ స్టార్ హీరోయిన్ కియరా అద్వానీ మాత్రం తను ప్రేమ వివాహమే చేసుకుంటానని చెబుతోంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు అస్సలు ఛాన్స్ ఇవ్వనంటోంది.

పెద్దలు కుదిర్చిన సంబంధం కంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తనకు చాలా ఇష్టమని అంటోంది కియరా. ఇప్పటికే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేశానని, కాబట్టి తన పెళ్లి గురించి ఆలోచించే శ్రమ తన తల్లిదండ్రులకు తప్పిందని చెబుతోంది.

బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కియరా డేటింగ్ లో ఉందనే వార్తలు చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఈ
నేపథ్యంలో, తన పెళ్లిపై ఈ బ్యూటీ ఇలా స్పందించడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఆమె నటించిన ఓ హిందీ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఇటు రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోంది ఈ బ్యూటీ.

First Published:  9 Aug 2021 8:02 AM GMT
Next Story