Telugu Global
NEWS

టీటీడీ చైర్మన్ గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డి..

టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి తిరిగి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం కూడా జరుగుతుందని స్పష్టం చేసింది. సుబ్బారెడ్డి పదవీకాలం ఇటీవలే పూర్తి కావడంతో ఆయన బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించి దానికి ఈవో జవహర్ రెడ్డిని ప్రత్యేక అధికారిగా ప్రకటించింది. ఆ తర్వాత పలు నామినేటెడ్ పోస్ట్ లను భర్తీ […]

టీటీడీ చైర్మన్ గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డి..
X

టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి తిరిగి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం కూడా జరుగుతుందని స్పష్టం చేసింది. సుబ్బారెడ్డి పదవీకాలం ఇటీవలే పూర్తి కావడంతో ఆయన బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించి దానికి ఈవో జవహర్ రెడ్డిని ప్రత్యేక అధికారిగా ప్రకటించింది. ఆ తర్వాత పలు నామినేటెడ్ పోస్ట్ లను భర్తీ చేసినా అందులో టీటీడీ అధ్యక్షుడి పేరు మాత్రం లేదు. ఇప్పుడు ఫైనల్ గా సుబ్బారెడ్డినే తిరిగి నియమించడం విశేషం.

వైవీ సుబ్బారెడ్డి 2014లో వైసీపీ తరపున ఒంగోలు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో ఆ స్థానం మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇచ్చారు జగన్. అసెంబ్లీకి కూడా వైవీ పోటీ చేయలేదు. ఈ క్రమంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్ గా ఆయనను నియమించారు. వీఐపీ దర్శనాల కుదింపు సహా.. పలు కీలక నిర్ణయాలు ఆయన హయాంలోనే జరిగాయి. అయితే రెండేళ్ల పదవీకాలం ముగియడంతో వైవీ సుబ్బారెడ్డి తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారంతా. టీటీడీ బోర్డుకి కొత్త చైర్మన్ నియమిస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

కానీ సీఎం జగన్ మాత్రం మరోసారి వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి టీటీడీ చైర్మన్ గా నియమించారు. బోర్డు సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది.

First Published:  8 Aug 2021 4:29 AM GMT
Next Story