Telugu Global
Cinema & Entertainment

సలార్ నుంచి కూడా ప్రకటన వస్తోంది?

సెట్స్ పైకి వచ్చినప్పట్నుంచి సలార్ సినిమాకు ప్రచారం మొదలైంది. ఆ ప్రచార పర్వాన్ని అలానే కొనసాగిస్తున్నారు మేకర్స్. సినిమా లాంఛింగ్ కు యష్ ప్రత్యేక అతిథిగా వచ్చినప్పట్నుంచి, ఇవాళ్టి వరకు సలార్ కు సంబంధించి ఏదో ఒక విశేషాన్ని బయటకు చెబుతూ ఫ్యాన్స్ లో ఆనందం నింపుతున్నారు. ఇదే ఊపులో సలార్ నుంచి మరో హంగామా రాబోతోంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పుడో మేకింగ్ వీడియో రెడీ అవుతోంది. త్వరలోనే ఆ వీడియోను విడుదల చేయబోతున్నారు. ఓ […]

prabhas salaar movie
X

సెట్స్ పైకి వచ్చినప్పట్నుంచి సలార్ సినిమాకు ప్రచారం మొదలైంది. ఆ ప్రచార పర్వాన్ని అలానే కొనసాగిస్తున్నారు మేకర్స్. సినిమా లాంఛింగ్ కు యష్ ప్రత్యేక అతిథిగా వచ్చినప్పట్నుంచి, ఇవాళ్టి వరకు సలార్ కు సంబంధించి ఏదో ఒక విశేషాన్ని బయటకు చెబుతూ ఫ్యాన్స్ లో ఆనందం నింపుతున్నారు. ఇదే ఊపులో సలార్ నుంచి మరో హంగామా రాబోతోంది.

ఈ మూవీకి సంబంధించి ఇప్పుడో మేకింగ్ వీడియో రెడీ అవుతోంది. త్వరలోనే ఆ వీడియోను విడుదల చేయబోతున్నారు. ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేసి మరీ మేకింగ్ వీడియో ఎనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ఇందులో ప్రభాస్, శృతిహాసన్ తో పాటు ఇతర నటీనటులంతా కనిపిస్తారట.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్, శృతిహాసన్ పై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది సలార్.

First Published:  7 Aug 2021 7:12 PM GMT
Next Story