Telugu Global
Cinema & Entertainment

పేరు పెట్టకుండా పాట రిలీజ్ చేస్తారట

పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించి ఓ కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ సాంగ్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో వింతేం లేదు. కాకపోతే ఇక్కడ చెప్పుకోబోయే ప్రయోగం ఏంటంటే.. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. సినిమాకు టైటిల్ ఎనౌన్స్ చేయకుండానే, సింగిల్ రిలీజ్ చేస్తున్నారన్నమాట. ఇప్పటివరకు ఏ సినిమాకు ఇలా జరగలేదు. ముందుగా టైటిల్, ఆ తర్వాత ఫస్ట్ లుక్, ఆ తర్వాత టీజర్, ఆ తర్వాత లిరికల్ వీడియోస్ అనే సంప్రదాయం నడుస్తోంది. […]

పేరు పెట్టకుండా పాట రిలీజ్ చేస్తారట
X

పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించి ఓ కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ సాంగ్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో వింతేం లేదు. కాకపోతే ఇక్కడ చెప్పుకోబోయే ప్రయోగం
ఏంటంటే.. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. సినిమాకు టైటిల్ ఎనౌన్స్ చేయకుండానే, సింగిల్ రిలీజ్ చేస్తున్నారన్నమాట.

ఇప్పటివరకు ఏ సినిమాకు ఇలా జరగలేదు. ముందుగా టైటిల్, ఆ తర్వాత ఫస్ట్ లుక్, ఆ తర్వాత టీజర్, ఆ తర్వాత లిరికల్ వీడియోస్ అనే సంప్రదాయం నడుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ సినిమాకు మాత్రం
ముందుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏకంగా లిరికల్ వీడియో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

పవన్ సినిమాకు సంబంధించి అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు త్రివిక్రమ్. తమన్ నుంచి పాటలు
రాబట్టుకోవడంతో పాటు టైటిల్ ను నిర్ణయించేది కూడా త్రివిక్రమే. ఈ సినిమాకు కేవలం స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతోనే ఆగిపోవడం లేదు త్రివిక్రమ్. ఇప్పటికే కొన్ని టైటిల్స్ అనుకున్నాడు. కానీ అవేవీ పవన్ కు నచ్చలేదు. దీంతో టైటిల్ విషయాన్ని పక్కనపెట్టి, పాటను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

First Published:  7 Aug 2021 7:21 PM GMT
Next Story