Telugu Global
National

కోవిడ్ కేసులే లేని జిల్లా.. భారత్ లోనే సరికొత్త రికార్డ్..

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారత్ లో ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఒకటో రెండో కేసులు కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా స్థిరంగానే ఉంటోంది. అయితే మహారాష్ట్రలోని భాంద్రా జిల్లా మాత్రం అరుదైన ఘనత సాధించింది. ఆ జిల్లాలో అసలు కోవిడ్ యాక్టివ్ కేసులే లేవు. కరోనాతో బాధపడుతున్న ఒకే ఒక్క రోగి కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడంతో భాంద్రా […]

కోవిడ్ కేసులే లేని జిల్లా.. భారత్ లోనే సరికొత్త రికార్డ్..
X

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారత్ లో ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఒకటో రెండో కేసులు కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా స్థిరంగానే ఉంటోంది. అయితే మహారాష్ట్రలోని భాంద్రా జిల్లా మాత్రం అరుదైన ఘనత సాధించింది. ఆ జిల్లాలో అసలు కోవిడ్ యాక్టివ్ కేసులే లేవు. కరోనాతో బాధపడుతున్న ఒకే ఒక్క రోగి కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడంతో భాంద్రా జిల్లా దేశంలోనే అరుదైన రికార్డు సాధించింది.

ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్ మెంట్.. ఇలా ఈ మూడింటినీ సమర్థంగా నిర్వహించడం వల్లే జీరో కరోనా కేసులతో భాంద్రా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుందని అన్నారు జిల్లా అధికారులు. 15నెలలుగా దీనికోసమే కష్టపడ్డామని చివరకు సాధించామని చెప్పారు జిల్లా కలెక్టర్ సందీప్ కదమ్. జిల్లాలో కేసులేవీ లేవని సంబరపడొద్దని, రాబోయే రోజుల్లో కూడా ప్రజలు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని చెప్పారాయన. ఇప్పటి వరకూ భాంద్రా జిల్లాలో 59,809 కేసులు నమోదు కాగా, 1,133మంది కోవిడ్ కి బలయ్యారు. మిగతావారంతా కోలుకున్నారు. ప్రస్తుతం ఆ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. కరోనా ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

గడ్చిరోలి, వార్దా, బీడ్, గోండియా జిల్లాల్లో కూడా యాక్టివ్ కేసుల సంఖ్య 5లోపే ఉంది. వారు కూడా డిశ్చార్జి అయితే మహారాష్ట్రలో అసలు కరోనా కేసులే లేని జిల్లాల సరసన వాటిని కూడా చేర్చొచ్చు. మహారాష్ట్రలో ప్రస్తుతం 71,050 యాక్టివ్ కేసులు ఉండగా.. ముంబై జిల్లాలో అత్యథికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఓ దశలో మహారాష్ట్ర దేశంలోనే అత్యథిక కేసులున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది. సెకండ్ వేవ్ ఉధృతిని తగ్గించడంలో అక్కడి అధికార యంత్రాంగం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది.

First Published:  8 Aug 2021 12:09 AM GMT
Next Story