Telugu Global
Cinema & Entertainment

కూతుర్ని చూసి పొంగిపోయిన బన్నీ

అల్లు కుటుంబం నుంచి మరో నటవారసత్వం రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్హ నటిగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. శాకుంతలం సినిమాలో చిన్ననాటి భరతుడి పాత్రలో అర్హ కనిపించనుంది. దీనికి సంబంధించి షూటింగ్ కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా.. కూతురు పెర్ఫార్మెన్స్ చూసేందుకు బన్నీ స్వయంగా సెట్స్ కు వచ్చాడు అవును.. శాకుంతల సెట్స్ లో బన్నీ ప్రత్యక్షమయ్యాడు. తన కూతుర్ని చూసేందుకు ఏకంగా కుటుంబ సమేతంగా వచ్చేశాడు. స్నేహారెడ్డి, అయాన్ కూడా బన్నీతో పాటు వచ్చారు. అర్హకు మేకప్ […]

కూతుర్ని చూసి పొంగిపోయిన బన్నీ
X

అల్లు కుటుంబం నుంచి మరో నటవారసత్వం రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్హ నటిగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. శాకుంతలం సినిమాలో చిన్ననాటి భరతుడి పాత్రలో అర్హ కనిపించనుంది. దీనికి సంబంధించి షూటింగ్ కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా.. కూతురు పెర్ఫార్మెన్స్ చూసేందుకు బన్నీ స్వయంగా సెట్స్ కు వచ్చాడు

అవును.. శాకుంతల సెట్స్ లో బన్నీ ప్రత్యక్షమయ్యాడు. తన కూతుర్ని చూసేందుకు ఏకంగా కుటుంబ
సమేతంగా వచ్చేశాడు. స్నేహారెడ్డి, అయాన్ కూడా బన్నీతో పాటు వచ్చారు. అర్హకు మేకప్ వేస్తున్నప్పుడు,
ఆమె కెమెరా ముందుకొచ్చినప్పుడు, గుణశేఖర్ యాక్షన్ అనగానే నటిస్తున్నప్పుడు అర్హను చూసి
మురిసిపోయాడు అల్లు అర్జున్.

సెట్స్ లో చాలా సేపు గడిపిన అల్లు అర్జున్, అర్హ ప్రతి సందర్భాన్ని ఎంజాయ్ చేశాడు. ఈ సందర్భంగా అర్హను బాగా చూసుకుంటున్న గుణశేఖర్, నీలిమ గుణ, సమంతకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు బన్నీ.

First Published:  7 Aug 2021 7:15 PM GMT
Next Story