Telugu Global
National

భారత్ లో జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు అత్యవసర అనుమతి..

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన సింగిల్ డోస్ టీకా కు భారత ప్రభుత్వం అత్యవసర అనుమతి మంజూరు చేసింది. ఆగస్ట్ 5న అత్యవసర అనుమతికోసం కంపెనీ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. రోజుల వ్యవధిలోనే వారికి అనుమతి లభించింది. భారత్ లో సింగిల్ డోస్ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చామంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. దీంతో ఇప్పటి వరకూ భారత ప్రభుత్వం […]

భారత్ లో జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు అత్యవసర అనుమతి..
X

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన సింగిల్ డోస్ టీకా కు భారత ప్రభుత్వం అత్యవసర అనుమతి మంజూరు చేసింది. ఆగస్ట్ 5న అత్యవసర అనుమతికోసం కంపెనీ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. రోజుల వ్యవధిలోనే వారికి అనుమతి లభించింది. భారత్ లో సింగిల్ డోస్ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చామంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. దీంతో ఇప్పటి వరకూ భారత ప్రభుత్వం అత్యవసర అనుమతి ఇచ్చిన టీకాల సంఖ్య 5కి చేరిందని ఆయన చెప్పారు. కరోనాపై భారత్ జరుపుతున్న పోరాటానికి ఈ ప్రక్రియ మరింత తోడ్పాటునిస్తుందని చెప్పారు.

సింగిల్ డోస్ లో తొలి టీకా ఇదే..
వ్యాక్సినేషన్లో భారత్ ఇటీవలే 50కోట్ల మార్కుని చేరుకోగా.. ఇప్పటి వరకూ మనదగ్గర అందుబాటులో ఉన్నవన్నీ డబుల్ డోస్ టీకాలే. కొవాక్సిన్, కొవిషీల్డ్ టీకాలు ఇప్పటికే విస్తృతంగా జనసామాన్యంలోకి వచ్చాయి. ఆ తర్వాత స్పుత్నిక్-వి పేరుతో రష్యా టీకాను రెడ్డీస్ ల్యాబ్ సంస్థ మన దేశంలో పంపిణీ చేస్తోంది. అయితే ఇది ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే లభిస్తోంది. ఆ తర్వాత అమెరికాకు చెందిన మోడెర్నా టీకాకు కూడా ఇటీవల కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది. మోడెర్నా టీకాలను దిగుమతి చేసుకుని పంపిణీ చేసేందుకు దేశీయ ఫార్మా సంస్థ సిప్లా రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో భారత్ లో అత్యవసర అనుమతి పొందిన ఐదో టీకా జాన్సన్ అండ్ జాన్సన్. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్నవన్నీ రెండు డోసుల వ్యాక్సిన్లు కాగా.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టీకా మాత్రమే సింగిల్ డోస్ వ్యాక్సిన్. భారత్ లో బయొలాజికల్-ఇ కంపెనీ ద్వారా ఈ వ్యాక్సిన్ పంపిణీ చేస్తారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ 85శాతం సమర్థవంతంగా పనిచేసినట్టు తేలింది.

First Published:  7 Aug 2021 6:11 AM GMT
Next Story