Telugu Global
Cinema & Entertainment

తొలి రోజు మెరిసిన కళ్యాణమండపం

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకుంటే సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ వచ్చి.. అనుమానాల్ని పటాపంచలు చేసింది. కాస్త బజ్ ఉన్న సినిమా వస్తే ఆడియన్స్ థియేటర్లకు వస్తారని నిరూపించింది ఆ మూవీ. ఇప్పుడు సెకెండ్ వేవ్ తర్వాత అలాంటి అనుమానాల్ని పటాపంచలు చేసిన సినిమా SR కళ్యాణమండపం. అన్నీ తానై కిరణ్ అబ్బవరం చేసిన ఈ సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లో కుర్రాళ్లు బాగా […]

తొలి రోజు మెరిసిన కళ్యాణమండపం
X

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకుంటే సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ వచ్చి.. అనుమానాల్ని పటాపంచలు చేసింది. కాస్త బజ్ ఉన్న సినిమా వస్తే ఆడియన్స్ థియేటర్లకు వస్తారని నిరూపించింది ఆ మూవీ. ఇప్పుడు సెకెండ్ వేవ్ తర్వాత అలాంటి అనుమానాల్ని పటాపంచలు చేసిన సినిమా SR కళ్యాణమండపం.

అన్నీ తానై కిరణ్ అబ్బవరం చేసిన ఈ సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా
చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లో కుర్రాళ్లు బాగా ఆసక్తి కనబరిచారు. అలా తొలి రోజు SR కళ్యాణమండపం
సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 51 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. సెకెండ్ వేవ్ తర్వాత అత్యథిక
వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది SR కళ్యాణమండపం.

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, ఈ సినిమాకు 2 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. అటు నైజాంలో ఈ సినిమా కోటి రూపాయల మార్క్ అందుకోవడం మరో విశేషం. ఇక సీడెడ్ లో ఈ సినిమాకు 50 లక్షలకు పైగా వసూళ్లు వచ్చాయి.

అయితే ఇవన్నీ గ్రాస్ లెక్కలు మాత్రమే. షేర్స్ లో చూసుకుంటే లెక్కలు తక్కువే. ఓవరాల్ గా పెట్టిన బడ్జెట్ లో 40శాతం రికవర్ అయినట్టు కనిపిస్తోంది. శని, ఆదివారాలు కూడా స్ట్రాంగ్ గా నిలబడితే బ్రేక్ ఈవెన్ అయిపోవడం గ్యారెంటీ.

First Published:  7 Aug 2021 8:58 AM GMT
Next Story