Telugu Global
Cinema & Entertainment

విశ్వక్ సేన్ వచ్చే టైమ్ వచ్చేసింది

టాలెంటెడ్ యంగ్ హీరో విష్వక్‌సేన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ యంగ్ హీరో లేటెస్ట్ మూవీ ‘పాగల్’. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఆగ‌స్ట్ 14న ఈ సినిమాను భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఈరోజు అధికారిక ప్రకటన చేశారు. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో విష్వక్ సేన్ కూల్ లుక్‌తో చేతిలో ఎర్రగులాబీని పట్టుకుని చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నాడు. వెనుక పోస్టర్‌లో మబ్బుల […]

విశ్వక్ సేన్ వచ్చే టైమ్ వచ్చేసింది
X

టాలెంటెడ్ యంగ్ హీరో విష్వక్‌సేన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ యంగ్ హీరో లేటెస్ట్ మూవీ ‘పాగల్’. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఆగ‌స్ట్ 14న ఈ సినిమాను భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఈరోజు అధికారిక ప్రకటన చేశారు. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో విష్వక్ సేన్ కూల్ లుక్‌తో చేతిలో ఎర్రగులాబీని పట్టుకుని చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నాడు. వెనుక పోస్టర్‌లో మబ్బుల నుంచి లవ్ సింబల్ కనిపిస్తుంది. అంటే సినిమా ప్రేమకథా చిత్రమని పోస్టర్ తెలియజేస్తుంది.

ఇదొక ఫీల్ గుడ్ ప్రేమ‌క‌థ‌ అంటున్నాడు దర్శకుడు నరేశ్ కుప్పిలి. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు
స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటించగా.. మరో ఇద్దరు హీరోయిన్లు సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ కీలక పాత్రలు పోషించారు.

First Published:  7 Aug 2021 8:53 AM GMT
Next Story