Telugu Global
National

తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు.. సెప్టెంబర్ తర్వాతే స్కూళ్లు..

కేరళలో కేసుల పెరుగుదలతో భయపడిన పక్క రాష్ట్రం తమిళనాడు కొవిడ్ కట్టడి చర్యలపై పట్టు సడలించడంలేదు. తమిళనాడులో తాజాగా లాక్ డౌన్ ని ఈనెల 23 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. అదనపు ఆంక్షలు కూడా విధించారు. ఇక స్కూళ్లు, కాలేజీలకు కూడా ఈనెలలో వెసులుబాటు ఇవ్వలేమని తేల్చి చెప్పారు సీఎం స్టాలిన్. ముఖ్యమైన ఆంక్షలివీ.. – ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి. – వారంలో నాలుగు […]

తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు.. సెప్టెంబర్ తర్వాతే స్కూళ్లు..
X

కేరళలో కేసుల పెరుగుదలతో భయపడిన పక్క రాష్ట్రం తమిళనాడు కొవిడ్ కట్టడి చర్యలపై పట్టు సడలించడంలేదు. తమిళనాడులో తాజాగా లాక్ డౌన్ ని ఈనెల 23 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. అదనపు ఆంక్షలు కూడా విధించారు. ఇక స్కూళ్లు, కాలేజీలకు కూడా ఈనెలలో వెసులుబాటు ఇవ్వలేమని తేల్చి చెప్పారు సీఎం స్టాలిన్.

ముఖ్యమైన ఆంక్షలివీ..
– ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి.
– వారంలో నాలుగు రోజులు మాత్రమే ప్రార్థనాలయాలు తెరవాలి. శుక్ర, శని, ఆదివారాల్లో అన్ని ప్రార్థనాలయాలకు మూత.
– దుకాణాల ప్రవేశద్వారం వద్ద వినియోగదారులు భౌతికదూరం పాటించడంతోపాటు శానిటైజర్‌ వాడడం, థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు తప్పనిసరి. థర్మల్ స్క్రీనింగ్ లో తేడా ఉంటే.. అక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసేలా ఏర్పాట్లు.
– మాంసాహార దుకాణాల వద్ద కఠిన నిబంధనలు.
– క్వారంటైన్‌ జోన్లలో అత్యవసర పనుల కోసమే జనసంచారానికి అనుమతి. వైద్యపరమైన సేవలకు మినహా ఇతరుల రాకపోకలపై నిషేధం.
– కరోనా లక్షణాలు కనపడగానే సమీపంలోని ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు తప్పనిసరి.

సెప్టెంబరు 1 నుంచి స్కూళ్లు..
తమిళనాడులో సెప్టెంబర్ 1నుంచి స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి. 9, 10, 11, 12 తరగతులను ఒకే సమయంలో 50 శాతం మంది విద్యార్థులతో నిర్వహించాలని, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్కూ ళ్లు తెరవాలని అధికారులకు సూచించారు సీఎం స్టాలిన్. వైద్య, నర్సింగ్‌ కళాశాలలు, వైద్య సంబంధిత కాలేజీలు ఈ నెల 16వ తేదీ నుంచి తెరచుకునేందుకు అనుమతిచ్చారు. విదేశాలనుంచి, ఇతర ప్రాంతాలనుంచి విమానాల్లో వచ్చే ప్రయాణికులకు ర్యాపిడ్ కరోనా టెస్ట్ పరికరం ద్వారా కొవిడ్ నిర్థారణ పరీక్షలు జరుపుతారు. 30నిముషాల్లో రిపోర్ట్ చేతిలో పెడతారు. పాజిటివ్ వస్తే అటునుంచి అటే క్వారంటైన్ సెంటర్ కి తరలిస్తారు. మిగతావారిని కూడా అప్రమత్తం చేస్తారు. మొత్తమ్మీద కరోనా నిబంధనల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది.

First Published:  6 Aug 2021 11:32 PM GMT
Next Story