Telugu Global
National

కేరళ తప్పుమీద తప్పు.. కేసులు పెరుగుతున్నా ఓనమ్ కి ఓకే..

ఇటీవల బక్రీద్‌ పండగ సందర్భంగా కొవిడ్‌ ఆంక్షలను సడలించి కేసుల సంఖ్య భారీగా పెరగడానికి కారణమైందని విమర్శలు ఎదుర్కొంది కేరళ ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుని కలకలం రేపింది. ఓనమ్‌ పండగ సందర్భంగా కేరళలో కొవిడ్ ఆంక్షలు సడలించారు. ఈనెల 12న ప్రారంభమై 23న ఓనమ్ ముగుస్తుంది. ఈ సందర్భంగా షాపింగ్, ఇతర అవసరాలకోసం ఈ సడలింపులు ఇచ్చారు. కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, దుకాణాలు, మార్కెట్లు, బ్యాంకులు, ఇతర కార్యాలయాలు, ఆర్థిక […]

కేరళ తప్పుమీద తప్పు.. కేసులు పెరుగుతున్నా ఓనమ్ కి ఓకే..
X

ఇటీవల బక్రీద్‌ పండగ సందర్భంగా కొవిడ్‌ ఆంక్షలను సడలించి కేసుల సంఖ్య భారీగా పెరగడానికి కారణమైందని విమర్శలు ఎదుర్కొంది కేరళ ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుని కలకలం రేపింది. ఓనమ్‌ పండగ సందర్భంగా కేరళలో కొవిడ్ ఆంక్షలు సడలించారు. ఈనెల 12న ప్రారంభమై 23న ఓనమ్ ముగుస్తుంది. ఈ సందర్భంగా షాపింగ్, ఇతర అవసరాలకోసం ఈ సడలింపులు ఇచ్చారు. కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, దుకాణాలు, మార్కెట్లు, బ్యాంకులు, ఇతర కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమలు, బహిరంగ పర్యాటక ప్రాంతాలు సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులు పనిచేస్తాయి. దుకాణాల వద్ద రద్దీని నియంత్రించేందుకు అన్ని దుకాణాలు, ఇతర సంస్థలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. పండగ జరిగే రోజుల్లో ఈనెల 12నుంచి 23వరకు ఆదివారాల్లో కూడా షాపులు తెరిచే ఉంచుతారు.

కేసుల పెరుగుదల ఇలా..
మరోవైపు కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.7 లక్షలకు పెరిగింది. రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు అక్కడ రికార్డవుతున్నాయి. వారం రోజులుగా రోజూ 20వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని మొత్తం కేసుల్లో 49.85 శాతం కేరళనుంచే వస్తున్నాయి. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం కూడా ఓ బృందాన్ని కేరళకు పంపించి పరిస్థితులపై అధ్యయనం చేయించింది. కేసులు పెరుగుతున్న దశలో ఆంక్షలు కఠినతరం చేయాల్సింది పోయి, పండగల పేరుతో సడలింపులు ఇస్తూ సీఎం పినరయి విజయన్ మరోసారి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

బక్రీద్ అనుభవం సరిపోలేదా..?
గతంలో బక్రీద్ పండగ సందర్భంగా కేరళలో కొవిడ్ ఆంక్షలు సడలించడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది. పలువురు కేంద్ర మంత్రులు సైతం కేరళ సర్కారు తీరుని విమర్శించారు. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం సడలింపుల విషయంలో వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత కేసుల సంఖ్య భారీగా పెరిగి దేశంలోనే కేరళ హాట్ స్పాట్ గా మారింది. సరిగ్గా ఇప్పుడు ఓనమ్ పండగకి కూడా సడలింపులు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేరళ సర్కార్.

First Published:  4 Aug 2021 8:57 PM GMT
Next Story