Telugu Global
NEWS

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10నుంచి తెల్లవారు ఝామున 6 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే వివిధ జిల్లాల్లో మాత్రం స్థానిక యంత్రాంగం ఈ నిబంధనలను మార్చేసింది. ముఖ్యంగా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ దాదాపుగా అమలులోకి వచ్చేసింది. గుంటూరుతో మొదలు.. అన్ లాక్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా గుంటూరులో ఆంక్షలు కఠినతరం చేశారు. కేసులు […]

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..
X

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10నుంచి తెల్లవారు ఝామున 6 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే వివిధ జిల్లాల్లో మాత్రం స్థానిక యంత్రాంగం ఈ నిబంధనలను మార్చేసింది. ముఖ్యంగా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ దాదాపుగా అమలులోకి వచ్చేసింది.

గుంటూరుతో మొదలు..
అన్ లాక్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా గుంటూరులో ఆంక్షలు కఠినతరం చేశారు. కేసులు తగ్గినట్టే తగ్గి పెరుగుతుండటంతో.. గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. గుంటూరు నగరంతోపాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం వరకే కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని ప్రకటించారు అధికారులు. గుంటూరు నగరంలోని బ్రాడీపేట సహా రద్దీ ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించారు. మధ్యాహ్నం తర్వాత బ్యారికేడ్లు పెట్టి నగరంలో రాకపోకల్ని సైతం అడ్డుకుంటున్నారు.

నెల్లూరులో ఇలా..
నెల్లూరు జిల్లాలో తొలుత కావలి ప్రాంతంలో పాక్షిక లాక్ డౌన్ విధించారు. సాయంత్రం 5 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలకు అనుమతులిచ్చారు. పొదలకూరు సహా మరికొన్ని ప్రాంతాల్లో వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం కేవలం 4గంటలు మాత్రమే వ్యాపారాలకు అనుమతులిస్తున్నారు. తాజాగా విడవలూరు మండలంలో మధ్యాహ్నం వరకే కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని స్థానిక అధికారులు ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతోందని అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావద్దని హెచ్చరించారు.

చిత్తూరు, పశ్చిమగోదావరిలో కూడా..
రోజువారి కేసుల సంఖ్యలో నెంబర్ 1 స్థానంలో ఉన్న చిత్తూరు, ఆ తర్వాతి స్థానంలో ఉన్న కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ అమలులో ఉంది. వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని చెబుతూ, అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య పెరిగితే ఆయా ప్రాంతాల అధికారులకు చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లా కేంద్రాల్లో హడావిడి..
సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత అన్ లాక్ సడలింపుల్లో భాగంగా నిబంధనల గేట్లు ఎత్తేయడంతో జిల్లా కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి. విందులు, వినోదాలు, విహార యాత్రలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కరోనా కేసుల్లో పెరుగుదుల స్పష్టంగా తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ఎత్తివేసే విషయంలో ఏమాత్రం తొందరపడాలనుకోలేదు. నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు జిల్లాల వారీగా అధికారులు ఎక్కడికక్కడ లాక్ డౌన్ అమలు చేస్తూ కరోనా కట్టడికి ముందస్తు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

First Published:  3 Aug 2021 9:28 PM GMT
Next Story