Telugu Global
NEWS

రుణంతో రణం.. వైసీపీ వర్సెస్ బీజేపీ..

ఏపీ రాజకీయాలు ఇప్పుడు అప్పుల చుట్టూ తిరుగుతున్నాయి. మీరింత అప్పుచేశారంటే, మీరంత చేశారంటూ రాజకీయ విమర్శలకు వేదిక అవుతున్నాయి. తాజాగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై రుణభారం పెంచుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి వైసీపీ నేతలు గట్టిగానే బదులిస్తున్నారు. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని, కేంద్రం సాయం అంతంతమాత్రంగానే ఉందని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా కొనసాగించేందుకే రుణాలు తీసుకుంటున్నట్టు వివరిస్తున్నారు. మధ్యప్రదేశ్ లాంటి […]

రుణంతో రణం.. వైసీపీ వర్సెస్ బీజేపీ..
X

ఏపీ రాజకీయాలు ఇప్పుడు అప్పుల చుట్టూ తిరుగుతున్నాయి. మీరింత అప్పుచేశారంటే, మీరంత చేశారంటూ రాజకీయ విమర్శలకు వేదిక అవుతున్నాయి. తాజాగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై రుణభారం పెంచుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి వైసీపీ నేతలు గట్టిగానే బదులిస్తున్నారు. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని, కేంద్రం సాయం అంతంతమాత్రంగానే ఉందని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా కొనసాగించేందుకే రుణాలు తీసుకుంటున్నట్టు వివరిస్తున్నారు. మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సగం జీతంతో సెలవలు ఇస్తున్నారని, ఏపీలో అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం చేయడంలేదా..?
ఏపీని వేలెత్తి చూపిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు కనిపించడంలేదా అని ప్ర‌శ్నించారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమవుతున్నా.. ఎక్కడా ఆగిపోలేదని, సామాజిక పింఛన్లు సైతం ఒకటో తేదీనే ఇచ్చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతోనే తిప్పలు ఎక్కువయ్యాయని, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదని చెప్పారాయన. అప్పుగా తీసుకొచ్చే ప్రతి పైసా సద్వినియోగం అవుతుందని వివరించారు.

మా తప్పులెన్నుతారా..?
కేంద్రం అప్పులు లెక్కతీయండి అంటూ వైసీపీ ప్రశ్నించే సరికి బీజేపీలో కదలిక వచ్చింది. కేంద్రం చేసే అప్పులపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బదులిచ్చారు. ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలసిన ఏపీ బీజేపీ నేతలు.. రాష్ట్ర అప్పులపై ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.25వేల కోట్లు అప్పు చేసిందని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు వీర్రాజు. ఆర్బీఐ నిబంధనలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విమర్శించారు.

మొత్తమ్మీద ఏపీ రుణభారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రుణాల విషయంలో కేంద్రం పాలసీ ఏంటి? ఇతర రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను పక్కనపెట్టి ఏపీని టార్గెట్ చేసింది బీజేపీ. వైసీపీ కూడా అంతే ధీటుగా అప్పుల విషయంలో కేంద్రాన్ని నిలదీసింది. ఆర్థిక సాయం చేయకుండా నిందలు వేయడం సరికాదంటోంది.

First Published:  3 Aug 2021 9:48 PM GMT
Next Story