Telugu Global
Editor's Choice

నియోజకవర్గాల పునర్విభజనపై తేల్చేసిన కేంద్రం..

పార్లమెంట్ సహా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోందనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంలో లోక్ సభ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ అనే వార్తలు రావడంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యత లభించింది. అయితే ఇదివరకే దీనిపై కేంద్రం స్పష్టతనివ్వగా.. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మరోసారి సమాధానం రూపంలో నియోజకవర్గాల పునర్విభజనపై క్లారిటీ వచ్చింది. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని భావించారంతా. […]

నియోజకవర్గాల పునర్విభజనపై తేల్చేసిన కేంద్రం..
X

పార్లమెంట్ సహా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోందనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంలో లోక్ సభ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ అనే వార్తలు రావడంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యత లభించింది. అయితే ఇదివరకే దీనిపై కేంద్రం స్పష్టతనివ్వగా.. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మరోసారి సమాధానం రూపంలో నియోజకవర్గాల పునర్విభజనపై క్లారిటీ వచ్చింది.

విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని భావించారంతా. కానీ విభజన జరిగి ఏడేళ్లవుతున్నా ఇంకా పునర్విభజన ఊసే లేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నియోజకవర్గ పునర్విభజన ఎప్పుడు జరుగుతుందంటూ రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా రాజ్యాంగంలోని 170(3) అధికరణం ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడతామని తెలిపారు.అంటే 2031 తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో 175, తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏపీలో 225, తెలంగాణలో 153 సీట్లు ఉంటాయని తెలుస్తోంది. కేంద్రం ఇచ్చిన క్లారిటీతో అటు దేశవ్యాప్తంగా కూడా నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడల్లా జరిగే అవకాశం లేదని తేలుతోంది. 2031 తర్వాతే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల విభజన జరుగుతుందని స్పష్టమైంది.

First Published:  3 Aug 2021 5:04 AM GMT
Next Story