Telugu Global
National

ఇ-రావణ కేరాఫ్ బీజేపీ..

రామ జపం చేసే బీజేపీ నేతలు, వాస్తవానికి రావణుడిని ఆదర్శంగా తీసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. వచ్చే ఏడాది జరగాల్సిన యూపీ ఎన్నికల్లో ఇ-రావణులను బీజేపీ రంగంలోకి దింపిందని విమర్శించారాయన. సోషల్ మీడియాలో ఇ-రావణులు తమ పని మొదలు పెట్టారని అన్నారు. విషప్రచారం చేస్తున్నారని, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మీడియాని, సోషల్ మీడియాని రాజకీయ ప్రచారాలకు, ప్రతిపక్షాలపై వ్యతిరేక ప్రచారాలకు బీజేపీ బాగా వాడుకుంటుందనేది బహిరంగ రహస్యం. ఆ […]

ఇ-రావణ కేరాఫ్ బీజేపీ..
X

రామ జపం చేసే బీజేపీ నేతలు, వాస్తవానికి రావణుడిని ఆదర్శంగా తీసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. వచ్చే ఏడాది జరగాల్సిన యూపీ ఎన్నికల్లో ఇ-రావణులను బీజేపీ రంగంలోకి దింపిందని విమర్శించారాయన. సోషల్ మీడియాలో ఇ-రావణులు తమ పని మొదలు పెట్టారని అన్నారు. విషప్రచారం చేస్తున్నారని, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

మీడియాని, సోషల్ మీడియాని రాజకీయ ప్రచారాలకు, ప్రతిపక్షాలపై వ్యతిరేక ప్రచారాలకు బీజేపీ బాగా వాడుకుంటుందనేది బహిరంగ రహస్యం. ఆ విద్వేష ప్రసంగాల ప్రచారానికి అడ్డు తగులుతున్నాయని ఇటీవల పలు సోషల్ మీడియా సంస్థలపై కేంద్రం ఆంక్షలు విధించాలనుకోవడం కూడా తెలిసిందే. ఈ క్రమంలో యూపీలో వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇ-రావణులను సిద్ధం చేసిందని అఖిలేష్ విమర్శిస్తున్నారు.

ఫేస్‌ బుక్, ట్విట్టర్, ఇన్‌ స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వేదికపై మత విద్వేషం చిమ్మేందుకు బీజేపీ పథకరచన చేసిందని అన్నారు అఖిలేష్. బీజేపీ సిద్ధం చేసిన రావణుల వలలో పడకుండా సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. సమాజ్‌ల వాదీ నేతలపై దుష్ప్రచారానికి బీజేపీ కంకణం కట్టుకుందని, ఎస్పీ నేతలంతా మంచి నడవడికతో మెలగాలని సూచించారు. ‘రాక్షస రాజు రావణుడి తరహాలో సోషల్‌ మీడియాలో అబద్ధాలు, పుకార్లను పుట్టించి, యూపీ అంతటా ప్రచారం చేసేందుకు ఇ–రావణులను బీజేపీ తీసుకొచ్చింది’అని అఖిలేష్ వ్యాఖ్యానించారు.

‘కొందరు బీజేపీ నేతలు.. సమాజ్‌ వాదీ పార్టీ నేతలుగా చెలామణి అవుతూ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యానాలు చేస్తూ వాటికి మరింత ప్రచారం కల్పిస్తారు. ఇలాంటి వారి పట్ల ఎస్పీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. సరిచూసుకోకుండా వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకండి. షేర్‌ చేయకండి. తప్పుడు పోస్ట్‌ లపై ఎప్పటికప్పుడు పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి’ అని కార్యకర్తలకు అఖిలేష్ సూచించారు. ఇటీవల కొందరు అఖిలేష్ పేరుతో ట్విట్టర్ ఖాతా తెరిచి.. రామమందిరం స్థానంలో బాబ్రీ మసీదు నిర్మిస్తామంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇలాంటి వాటిపై ఎస్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించింది.

First Published:  31 July 2021 9:49 PM GMT
Next Story