Telugu Global
Cinema & Entertainment

తిమ్మరుసు మూవీ రివ్యూ

నటీనటులు: సత్యదేవ్‌, ప్రియాంక జ‌వాల్కర్‌, బ్రహ్మాజీ, అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌, అంకిత్ తదితరులు సంగీతం: శ్రీచరణ్‌ పాకాల సినిమాటోగ్రఫీ: అప్పూ ప్రభాకర్‌ నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌ దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి విడుదల తేది : 30 జులై 2021 రేటింగ్: 2.5/5 సస్పెన్స్, థ్రిల్ కథలతో సినిమాలు తీసే జనాలకు ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. అదేంటంటే.. ఇలాంటి కథలకు హీరో అక్కర్లేదు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మంచి టెక్నీషియన్స్ […]

తిమ్మరుసు మూవీ రివ్యూ
X

నటీనటులు: సత్యదేవ్‌, ప్రియాంక జ‌వాల్కర్‌, బ్రహ్మాజీ, అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌, అంకిత్ తదితరులు
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ: అప్పూ ప్రభాకర్‌
నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌
దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి
విడుదల తేది : 30 జులై 2021
రేటింగ్: 2.5/5

సస్పెన్స్, థ్రిల్ కథలతో సినిమాలు తీసే జనాలకు ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. అదేంటంటే.. ఇలాంటి
కథలకు హీరో అక్కర్లేదు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మంచి టెక్నీషియన్స్ ను పెట్టుకుంటే చాలు, పనైపోతుంది. అదే సమయంలో అతిపెద్ద డిజ్-అడ్వాంటేజ్ కూడా ఒకటి ఉంది. ఏమాత్రం గ్రిప్పింగ్ గా కథ లేకపోయినా
ప్రేక్షకులు పెదవి విరుస్తారు. బాగుంది అనే బదులు ఓకే అనేస్తారు. సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు సినిమా ఈ రెండో కేటగిరీ కిందకు వస్తుంది.

ఈరోజు థియేటర్లలోకొచ్చిన తిమ్మరుసు సినిమా ఆహా..ఓహో అనేంత బ్రహ్మాండమైన సినిమా కాదు. అలాఅని తీసిపారేసే నాసిరకం సరుకు కూడా కాదు. ఉన్నంతలో బాగుందంటే బాగుంది. ఏమంత గొప్పగా మాత్రం లేదు. దీనికి కారణమైన వ్యక్తి, పూర్తి బాధ్యత వహించాల్సిన వ్యక్తి ఒకరే. అతడే దర్శకుడు శరణ్.

నిజానికి తిమ్మరుసు సినిమా ఓ రీమేక్. ఉన్నది ఉన్నట్టు మక్కికిమక్కి దించేశారు. కానీ ప్రేక్షకుల టేస్ట్, ఐక్యూ లెవెల్స్ ను అంచనా వేయలేకపోయారు. ఒరిజినల్ సినిమా కన్నడంలో వచ్చింది. అక్కడి ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు సినిమా విషయంలో ఐక్యూ తేడా చాలా ఉంది. ఉదాహరణకు కపటధారి సినిమానే తీసుకుంటే.. కన్నడలో అది పెద్ద హిట్. కానీ యాజ్ ఇటీజ్ గా తీస్తే తెలుగులో ఫ్లాప్ అయింది. ఎందుకంటే, ఆ ట్విస్టులు, టర్న్ లు తెలుగోళ్లకు కొత్తకాదు. సరిగ్గా తిమ్మరుసు సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. కన్నడ ఆడియన్స్ తో పోలిస్తే, తెలుగు ప్రేక్షకులు చాలా అడ్వాన్స్డ్ అనే విషయాన్ని దర్శకుడు మరిచిపోయినట్టున్నాడు.

ఈ సినిమాలో 2 ట్విస్టులైతే బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఆ ట్విస్టులకు ముందు, ఆ తర్వాత అల్లుకున్న
సన్నివేశాలు మాత్రం పేలవంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, తెలుగు ఆడియన్స్ ఐక్యూ లెవెల్ స్థాయిలో లేవు. అందుకే తిమ్మరుసుకు పెదవి విరుపులు తప్పలేదు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు, ఈ సినిమాను తీసిపారేయలేం. దీనికి కారణం సత్యదేవ్.

లాయర్ గా సత్యదేవ్ నటన సూపర్. నటుడిగా అయన్ను మరో మెట్టు పైకి తీసుకెళ్తుంది తిమ్మరుసు. ఈ
సినిమా కమర్షియల్ మీటర్ అందుకునే ప్రయత్నం కూడా చేశాడు ఈ నటుడు. ఇక హీరోయిన్ ప్రియాంక
జవాల్కర్ కు పెద్దగా స్కోప్ లేదు. బ్రహ్మాజీ పాత్ర మరోసారి పేలింది. ఝూన్సీ, అజయ్, వైవా హర్ష తమ పాత్రల మేరకు నటించారు. టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఫైట్స్ బాగున్నాయి.

ఇక కథ విషయానికొస్తే.. రోడ్డుపై అర్థరాత్రి క్యాబ్ డ్రైవర్ అరవింద్ మర్డర్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ చూసిన పబ్ లో వర్క్ చేసే బాయ్ వాసు(అంకిత్) ని పోలీసులు కేసులో ఇరికించి అతనికి శిక్ష పడేలా చేస్తారు. కానీ ఎనిమిదేళ్ల తరువాత ఊహించని విధంగా లాయర్ రామచంద్ర (సత్యదేవ్) అరవింద్ మర్డర్ కేసుని రీ ఒపెన్ చేస్తాడు. అలా మర్డర్ కేసుని టేకప్ చేసిన రామ్ కి.. అతనితో కలిసి లాయర్ గా వర్క్ చేసే అను (ప్రియాంక జవాల్కర్), సుధా(బ్రహ్మాజీ)లు హెల్ప్ చేస్తుంటారు.

మరో వైపు పోలీస్ ఆఫీసర్ భూపతి రాజు (అజయ్) , లాయర్ వరాహమూర్తి (రవిబాబు) కేసుని మళ్లీ క్లోజ్ చేయించే ప్లానింగ్ లో ఉంటూ రామ్ కి ఎలాంటి సాక్ష్యాలు దొరకకుండా చేస్తుంటారు. అసలు ఎనిమిదేళ్ళ క్రితం క్లోజ్ అయిన క్యాబ్ డ్రైవర్ కేసుని రామ్ మళ్లీ ఎందుకు రీ ఓపెన్ చేశాడు? ఇంతకీ రామ్ ఎవరు? చివరికి రామ్ తన లాయర్ బ్రెయిన్ తో మర్డర్ చేసిన వ్యక్తికి శిక్ష వేయించి, వాసుని ఎలా నిర్దోషి గా ప్రూవ్ చేశాడనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్
– సత్యదేవ్ నటన
– బ్యాక్ గ్రౌండ్ స్కోర్
– ఇంటర్వెల్ బ్యాంగ్

మైనస్ పాయింట్స్
– ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్
– నెరేషన్ సరిగ్గా లేకపోవడం

బాటమ్ లైన్ – ఓకే తిమ్మరుసు

First Published:  30 July 2021 5:19 AM GMT
Next Story