Telugu Global
NEWS

ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ " అనుమానాలొద్దు.. విద్యాశాఖ‌ మంత్రి క్లారిటీ..

కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ, థర్డ్ వేవ్ పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు కొన్ని సర్వేలు తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్లకు పంపించేందుకు ఇష్టపడటంలేదని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో స్కూల్స్ పునఃప్రారంభంపై అనుమానాలొద్దని స్పష్టం చేశారు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని.. దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు మంత్రి సురేష్. జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌పై సీఎం వైఎస్‌ జగన్‌ జరిపిన సమీక్షలో […]

ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్  అనుమానాలొద్దు.. విద్యాశాఖ‌ మంత్రి క్లారిటీ..
X

కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ, థర్డ్ వేవ్ పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు కొన్ని సర్వేలు తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్లకు పంపించేందుకు ఇష్టపడటంలేదని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో స్కూల్స్ పునఃప్రారంభంపై అనుమానాలొద్దని స్పష్టం చేశారు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.

ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని.. దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు మంత్రి సురేష్. జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌పై సీఎం వైఎస్‌ జగన్‌ జరిపిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆగస్ట్ 15లోగా ఏపీలో ఉపాధ్యాయుల‌కు 100శాతం బూస్టర్ డోస్ తో పాటు వ్యాక్సినేషన్ పూర్తిచేయాల‌ని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. స్కూళ్లు తెరిచే సమయానికి విద్యాకానుక పంపిణీ కూడా పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి. విద్యా కానుకలో భాగంగా ఇచ్చే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెల్టులు 100 శాతం అందుబాటులో ఉన్నాయని, స్కూలు బ్యాగులు 80 శాతం, యూనిఫాంలు 80 శాతం, డిక్షనరీలు 20 శాతం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.

నాడునేడులో ఫస్ట్ ఫేజ్ లో జ‌రుగుతున్న ప‌నులు 90 నుండి 98 శాతం పూర్తయ్యాయని తెలిపారు మంత్రి సురేష్‌. ఆగస్ట్ 16న నాడు-నేడు ని రాష్ట్ర ప్రజ‌ల‌కు అంకితం చేస్తామని చెప్పారు. అదే రోజు ఫేజ్ 2 పనులు మొదలవుతాయని, సుమారు 4వేల కోట్ల రూపాయలతో 16వేల స్కూళ్ల రూపురేఖ‌లు మార్చేలా కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడించారు. అమ్మఒడి, వసతి దీవెన డబ్బులు వద్దనుకునేవారికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ల్యాప్ టాప్ లు ఇస్తామన్నారు మంత్రి. ఆగస్ట్ 16నుంచి కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ స్కూళ్లను పునఃప్రారంభిస్తున్నట్టు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు అపోహలు పెట్టుకోకుండా పిల్లలను స్కూళ్లకు పంపించ వచ్చని, ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తున్నామని భరోసా ఇచ్చారు.

First Published:  29 July 2021 7:12 AM GMT
Next Story