Telugu Global
Health & Life Style

ఎముకలు వీక్ అవుతున్నాయా?

ప్రస్తుతం మనం పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ ను బట్టి మనకు కొన్ని పోషకాలు సరైన రీతిలో అందడం లేదని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అందులో ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి ముందున్నాయి. ఈ రెండింటి లోపం ఎక్కువైతే ఆ ఎఫెక్ట్ ఎముకలపై పడుతుంది. ఎముకలు పటుత్వాన్ని కోల్పోయి. కండరాలు బలహీనమవుతాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలంటే.. విటమిన్ డి ఎక్కువగా ఉదయం సాయత్రం ఎండ నుంచి లభిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ […]

ఎముకలు వీక్ అవుతున్నాయా?
X

ప్రస్తుతం మనం పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ ను బట్టి మనకు కొన్ని పోషకాలు సరైన రీతిలో అందడం లేదని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అందులో ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి ముందున్నాయి. ఈ రెండింటి లోపం ఎక్కువైతే ఆ ఎఫెక్ట్ ఎముకలపై పడుతుంది. ఎముకలు పటుత్వాన్ని కోల్పోయి. కండరాలు బలహీనమవుతాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలంటే..

విటమిన్ డి ఎక్కువగా ఉదయం సాయత్రం ఎండ నుంచి లభిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా ఎండ నుంచి విటమిన్ పొందే అవకాశం మనకు చాలా తక్కువ. ఇకపోతే కాల్షియం. ఇది కూడా కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ నుంచే లభిస్తుంది. అందుకే ఈ రెండింటి లోపం మనలో చాలా మందిని వేధిస్తుంది. ఎముకలు, కండరాలు, ఇతర వ్యాధులను నివారించడానికి విటమిన్ డి, కాల్షియం సరైన పాళ్లలో ఉండాలి. అందుకే కొన్ని ఆహారాలను మర్చిపోకుండా అప్పుడప్పుడు తింటుండాలి.

గుడ్డు
రోజుకో గుడ్డు తినడం ఎంతో మేలు చేస్తుంది. గుడ్డు నుంచి ప్రోటీన్ మాత్రమే కాకుండా దాని నుంచి కాల్షియం కూడా లభిస్తుంది. అలాగే గుడ్డు లోని పచ్చసొన శరీరంలో విటమిన్ డి తయారయ్యేలా ప్రోత్సహిస్తుంది.

చేపలు
కేవలం చేపల ద్వారా మాత్రమే దొరకే కొన్ని పోషకాలు ఉన్నాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాంటివే.. అయితే చేపలు తినడం ద్వారా విటమిన్ డి, కాల్షియం స్థాయిలను కూడా పెంచుకోవచ్చు. అందుకే అప్పుడప్పుడు కొవ్వు కలిగిన చేపలను తింటుండడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

పాలు
కాల్షియం లోపం ద్వారా వచ్చే ఎముకల సమస్యలను పాల ద్వారా తగ్గించుకోవచ్చు. పాలు, పాల ఉత్పత్తులు ఎముకలను బలంగా ఉంచడానికి ఎంతగానో సాయపడతాయి. పాల నుంచి కాల్షియం ఎక్కువగా లభిస్తుంది.

First Published:  29 July 2021 4:13 AM GMT
Next Story