Telugu Global
Health & Life Style

హెల్త్ ఇన్సూరెన్స్ మంచిదేనా?

కష్టపడి సంపాదించి ఎంత పోగేసినా.. ఏదైనా పెద్ద సమస్యతో ఒక్కసారి హాస్పిటల్ కు వెళ్తే అంతే సంగతి. ఉన్నదంతా ఊడ్చి ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ రోజుల్లో వైద్యం ఎంత కాస్ట్లీ అయిందో అందరికీ తెలుసు. అందుకే ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా ఏదైనా భరోసా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటిదే.. వైద్యం మరీ ఖర్చుతో కూడుకున్న ఈ రోజుల్లో సేఫ్టీ కోసం ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. చిన్నదో పెద్దదో.. […]

హెల్త్ ఇన్సూరెన్స్ మంచిదేనా?
X

కష్టపడి సంపాదించి ఎంత పోగేసినా.. ఏదైనా పెద్ద సమస్యతో ఒక్కసారి హాస్పిటల్ కు వెళ్తే అంతే సంగతి. ఉన్నదంతా ఊడ్చి ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ రోజుల్లో వైద్యం ఎంత కాస్ట్లీ అయిందో అందరికీ తెలుసు. అందుకే ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా ఏదైనా భరోసా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటిదే..

వైద్యం మరీ ఖర్చుతో కూడుకున్న ఈ రోజుల్లో సేఫ్టీ కోసం ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. చిన్నదో పెద్దదో.. ఓ ఆరోగ్య బీమా ఉంటే అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు రాకుండా సేఫ్‌గా ఉండొచ్చు.

ఆరోగ్య బీమా అనేది వయసుల వారీగా ఎంచుకోవచ్చు. పాలసీని బట్టి చిన్న చిన్న సమస్యల నుంచి క్యాన్సర్ లాంటి పెద్ద సమస్యల వరకూ వీటిలో కవర్ అవుతాయి. మనం కట్టే ప్రీమియంను బట్టి టోటల్ కవరేజ్ అనేది ఉంటుంది. ఉదాహరణకు అచ్చంగా కోవిడ్ కోసం కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. వీటి ప్రీమియం 500 నుంచి మొదలవుతుంది. టోటల్ కవరేజ్ లక్ష రూపాయల వరకూ అందుతుంది. అంటే 500 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒకవేళ టైం బాగోక కోవిడ్ వచ్చి హాస్పిటల్‌కు వెళ్లాల్సి వస్తే.. పాలసీ కవరేజ్ కింద లక్ష రూపాయల వరకూ ఇన్సూరెన్స్ అందుతుంది. ఇలాగే ఏ అనారోగ్యం ఎదురైనా ఆర్థికంగా ఇతరులపై ఆధారపడకుండా.. దాని చికిత్సకయ్యే ఖర్చును పాలసీ కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే పాలసీ తీసుకునే ముందు అందులో ఏయే సమస్యలు కవర్ అవుతాయి అనేది చెక్ చేసుకోవాలి.

కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా తీసుకున్న తర్వాత ఓ డిజిటల్ కార్డును అందజేస్తాయి. సంబంధిత ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రుల్లో ఆ కార్డు ద్వారా పేమెంట్స్ చేయొచ్చు.
వయసు, ఫ్యామిలీ, ఆదాయం, మీకున్న అనారోగ్య సమస్యలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని పాలసీ రేట్లు ఉంటాయి. మనకు ఎంతమొత్తం అవసరమయ్యే అవకాశం ఉందో ఓ అంచనా వేసుకుని దానికి తగ్గట్టు పాలసీ తీసుకోవాలి. అలాగే పాలసీ తీసుకునే ముందు ఏయే అనారోగ్యాలు అందులో కవర్ అవుతాయో తెలుసుకోవాలి. అలాగే పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

First Published:  28 July 2021 3:17 AM GMT
Next Story