Telugu Global
Health & Life Style

రెండుడోసుల వ్యాక్సిన్​ తీసుకుంటే ఎన్నిరోజులు సేఫ్​?

వ్యాక్సిన్​ తీసుకుంటే కరోనా మహమ్మారి ని పూర్తిగా ఎదుర్కోగలమా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంతమేరకు పనిచేస్తున్నాయి. ఒకసారి కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. వ్యాక్సినేషన్​ తీసుకున్నవారిలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. అయితే కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు ఎక్కువ ఉంటాయా? లేదంటే వ్యాక్సిన్​ తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయా? అన్న విషయంపై చాలా రోజులుగా పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా విడుదలైన పరిశోధన ప్రకారం.. కరోనా సోకిన వారికంటే .. వ్యాక్సినేషన్​ తీసుకున్నవారిలోనే యాంటీబాడీలు […]

రెండుడోసుల వ్యాక్సిన్​ తీసుకుంటే ఎన్నిరోజులు సేఫ్​?
X

వ్యాక్సిన్​ తీసుకుంటే కరోనా మహమ్మారి ని పూర్తిగా ఎదుర్కోగలమా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంతమేరకు పనిచేస్తున్నాయి. ఒకసారి కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. వ్యాక్సినేషన్​ తీసుకున్నవారిలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. అయితే కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు ఎక్కువ ఉంటాయా? లేదంటే వ్యాక్సిన్​ తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయా? అన్న విషయంపై చాలా రోజులుగా పరిశోధనలు సాగుతున్నాయి.

తాజాగా విడుదలైన పరిశోధన ప్రకారం.. కరోనా సోకిన వారికంటే .. వ్యాక్సినేషన్​ తీసుకున్నవారిలోనే యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని తేలింది. ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని కింగ్​ జార్జ్​ మెడికల్​ కళాశాల ఈ మేరకు పరిశోధన జరిపింది. మొత్తం 2 వేల మందిపై అధ్యయనం చేపట్టారు. ఈ పరిశోధనలో కోవిడ్​ ఇన్​ఫెక్షన్​ వల్ల కలిగే యాంటీబాడీలు మూడు నుంచి నాలుగు నెలల తర్వాత క్షీణిస్తున్నాయని గుర్తించారు. అయితే రెండు డోసులు వ్యాక్సిన్​ తీసుకున్న వారిలో ఎక్కువ కాలం యాంటీబాడీలు ఉంటున్నాయని పరిశోధనలో తేలింది.

90 శాతం వైద్యులు, పారామెడికల్​ సిబ్బందిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 68 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకోగా 11 శాతం మంది ఒకడోసు తీసుకున్నారు. మరో 11 శాతం వ్యాక్సిన్​ తీసుకోని వారిలో కోవిడ్​ యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు కనుగొన్నారు. రెండు డోసులు తీసుకున్న 5 శాతం మందిలో అసలు యాంటీబాడీలు వృద్ధి చెందలేదని వైద్యులు గుర్తించారు.

First Published:  28 July 2021 8:27 AM GMT
Next Story