Telugu Global
National

కర్ణాటక సీఎంగా బొమ్మై ప్రమాణస్వీకారం..

బసవరాజ బొమ్మై కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణం చేయించారు. యడియూరప్ప ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో బొమ్మైకి అవకాశం దక్కింది. యడియూరప్ప రాజీనామా వ్యవహారం చాలా రోజులుగా నానుతూ వచ్చింది. బీజేపీ పెద్దల సూచన మేరకు ఎట్టకేలకు ఆయన రాజీనామా చేశారు. బసవరాజ బొమ్మై గతంలో కర్ణాటక హోంమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో చాలా రోజులుగా లింగాయత్​ సామాజికవర్గం బీజేపీకి అండగా […]

కర్ణాటక సీఎంగా బొమ్మై ప్రమాణస్వీకారం..
X

బసవరాజ బొమ్మై కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణం చేయించారు. యడియూరప్ప ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో బొమ్మైకి అవకాశం దక్కింది. యడియూరప్ప రాజీనామా వ్యవహారం చాలా రోజులుగా నానుతూ వచ్చింది. బీజేపీ పెద్దల సూచన మేరకు ఎట్టకేలకు ఆయన రాజీనామా చేశారు. బసవరాజ బొమ్మై గతంలో కర్ణాటక హోంమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

కర్ణాటకలో చాలా రోజులుగా లింగాయత్​ సామాజికవర్గం బీజేపీకి అండగా నిలబడుతూ వస్తున్నది. కర్ణాటకలో బలమైన సామాజికవర్గమైన లింగాయత్​ తరఫున యడియూరప్ప ప్రతినిధిగా వ్యవహరించారు. అయితే ఆయన రాజీనామాతో లింగాయత్​లలో అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా అదే సామాజిక వర్గానికి చెందిన బొమ్మైను సీఎం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆర్‌ అశోక్‌(వక్కలిగ), గోవింద కారజోళ(దళిత), బీ శ్రీరాములు (బోయ) ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. యడియూరప్ప అయిష్టంగానే ఈ పదవి నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నానని ప్రకటించే ముందు ఆయన ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యడియూరప్ప తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

కొన్ని రోజుల క్రితం యడియూరప్ప ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీని కలుసుకున్నారు. ప్రధాని సూచనమేరకే ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే తన కుమారుడు విజయేంద్ర రాజకీయ భవితవ్యంపై ఆయన ప్రధానిని కోరినట్టు సమాచారం. తాజాగా బీజేపీ పెద్దలు యడియూరప్పను గవర్నర్​గా వెళ్లాలని సూచించారట. అయితే అందుకు ఆయన ససేమిరా అన్నట్టు సమాచారం. యడియూరప్ప కర్ణాటక రాజకీయాల్లో యాక్టివ్​గా ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రికి తలనొప్పులు తెస్తారేమోనని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

మరోవైపు యడ్డీ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని చూస్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్​ కోసం ఆయన తాపత్రయ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కర్ణాటక రాజకీయాలు ఎటువంటి మలుపు తిరుగుతాయోనని ఆసక్తి నెలకొన్నది.

First Published:  28 July 2021 7:12 AM GMT
Next Story