Telugu Global
Cinema & Entertainment

గల్లీ రౌడీ సెన్సార్ టాక్ ఏంటి?

యంగ్ అండ్ ఎనర్జిటి స్టార్ సందీప్‌కిష‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `గ‌ల్లీరౌడీ`. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. రైట‌ర్ కోన వెంక‌ట‌్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించారు. ఇక కోలీవుడ్ యాక్టర్ బాబీ […]

గల్లీ రౌడీ సెన్సార్ టాక్ ఏంటి?
X

యంగ్ అండ్ ఎనర్జిటి స్టార్ సందీప్‌కిష‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'గ‌ల్లీరౌడీ'. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. రైట‌ర్ కోన వెంక‌ట‌్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది.

న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించారు. ఇక కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. నేహా శెట్టి హీరోయిన్‌.

ఇప్పటి వరకు ‘గల్లీ రౌడీ’ చిత్రం నుంచి విడుదలైన ‘పుట్టేనె ప్రేమ..’ అనే మాంటేజ్ లవ్ సాంగ్, ‘చాంగురే చాంగురే..’ అనే ఐటెమ్ సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే సినిమా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ అని తెలియ‌జేసేలా విడుద‌లైన టీజ‌ర్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉందంటూ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గల్లీ రౌడీ’ సినిమాను ఆగస్ట్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కానుంది.

First Published:  27 July 2021 6:24 AM GMT
Next Story