Telugu Global
International

ఒలింపిక్స్‌లో మన ప్రస్థానం ఇదే..

ప్రపంచంలోని క్రీడాకారులంతా వేయి కళ్లతో ఎదురుచూసే రోజు రానే వచ్చింది. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ఈవెంట్ నేటి నుంచి ప్రారంభం అవుతుంది. అంగరంగ వైభవంగా, అత్యంత కోలాహలంతో జరగాల్సిన ఈ ఈవెంట్ ఈ సారి కరోనా వల్ల ఎన్నో రెస్ట్రిక్షన్స్ మధ్యన జరుగుతోంది. కరోనా విజృంభస్తున్నా.. జపాన్ మాత్రం ఒలింపిక్స్ ని సీరియస్ గా తీసుకుంది. టోక్యో అంతటా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఒలింపిక్స్ ఈవెంట్ కు వచ్చిన ప్రతీ అథ్లెట్లకు ప్రతీ రోజు కరోనా […]

ఒలింపిక్స్‌లో మన ప్రస్థానం ఇదే..
X

ప్రపంచంలోని క్రీడాకారులంతా వేయి కళ్లతో ఎదురుచూసే రోజు రానే వచ్చింది. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ఈవెంట్ నేటి నుంచి ప్రారంభం అవుతుంది. అంగరంగ వైభవంగా, అత్యంత కోలాహలంతో జరగాల్సిన ఈ ఈవెంట్ ఈ సారి కరోనా వల్ల ఎన్నో రెస్ట్రిక్షన్స్ మధ్యన జరుగుతోంది.
కరోనా విజృంభస్తున్నా.. జపాన్ మాత్రం ఒలింపిక్స్ ని సీరియస్ గా తీసుకుంది. టోక్యో అంతటా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఒలింపిక్స్ ఈవెంట్ కు వచ్చిన ప్రతీ అథ్లెట్లకు ప్రతీ రోజు కరోనా టెస్టులు చేస్తున్నారు. ఒలింపిక్స్ విలేజ్ దాటి ఎక్కడికీ బయటకు వెళ్లే అనుమతి లేదు. అలాగే ఈ సారి స్టేడియాల్లో ఆడియన్స్ కు కూడా ఎంట్రీ లేదు.

ఇకపోతే ఈ సారి ఒలింపిక్స్ పూర్తి పర్యావరణహితంగా జరగబోతున్నాయి. ఈవెంట్ అంతా సోలార్ ఎనర్జీనే ఉపయోగిస్తున్నారు. అథ్లెట్ల బెడ్స్ కూడా కట్టెతో కాకుండా అట్టలతో రెడీ చేశారు. అలాగే సముద్రంలోని ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేసి, దాంతో పోడియాలు సిద్ధం చేశారు. పాడైన మొబైల్స్ వేస్టేజ్ తో పతకాలను తయారు చేశారు. మొత్తంగా లండన్‌ గేమ్స్‌లో 3.3 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉత్పత్తి కాగా దాన్ని ఈ సారి 2.93 మిలియన్‌ టన్నులకు తగ్గించగలిగారు.

కరోనా వల్ల ఈవెంట్ స్టైల్ మారినా.. అథ్లెట్స్ ఇంకా అభిమానుల ఉత్సా్హంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వేల మంది క్రీడాకారులు తమ ఎన్నో ఏళ్ల కళలను నిజం చేసుకోడానికి రెడీ అయ్యారు. తమ దేశాలను విజేతలుగా చూడాలని కోట్లమంది క్రీడాభిమానులు ఆశలతో ఎదురుచూస్తున్నారు.
ఒలింపిక్స్ కోసం ఈ సారి భారత్ పక్కా్గానే రెడీ అయింది. ప్రతీసారి రెండు మూడు మెడల్స్ తో సరిపెట్టుకునే భారత్ ఈ సారి ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఒలింపిక్స్ లో భారత్ ప్రస్థానాన్ని ఓ సారి చూస్తే..

1900 నుంచి ఇప్పటివరకూ భారత్ ఒలింపిక్స్ లో మొత్తం 28 పతకాలను మాత్రమే గెలుపొందింది. ఇందులో 11 పతకాలు హాకీ క్రీడలో సాధించగా, రెజ్లింగ్ లో 5, షూటింగ్ లో 4, బ్యాడ్మింటన్ లో 2, బాక్సింగ్ లో 2, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో ఒకటి చొప్పున పతకాలను సాధించింది. రీసెంట్ గా 2016 రియో ఒలింపిక్స్: 1 సిల్వర్, 1 బ్రాంజ్ మాత్రనమే సాధించింది. అంతకు ముదు 2012 లండన్ ఒలింపిక్స్ లో 2 సిల్వర్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్ సాధించింది.

ఈ సారి టోక్యో ఒలింపిక్స్ కు భారత్ నుంచి 85 క్రీడా విభాగాల్లో 120 మంది అథ్లెట్లు పోటీపడనున్నారు. షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ, బ్యాడ్మింటన్ ఈవెంట్‌లలో భారత్ కు పతకాలు లభించే ఛాన్స్ లు ఎక్కువ.

First Published:  23 July 2021 2:08 AM GMT
Next Story