Telugu Global
National

ఏపీపై బీజేపీకి కొత్త ప్రేమ..

ఏపీ అసెంబ్లీలో ఒక్క సీటు లేకపోయినా తామే ప్రధాన ప్రతిపక్షం అంటారు బీజేపీ నేతలు. స్థానిక ఎన్నికల్లో సీట్లు రాకపోయినా, ఉప ఎన్నికల్లో డిపాజిట్లు లేకపోయినా ఏపీలో బీజేపీ నాయకుల హడావిడి ఏమాత్రం తగ్గదు. ఇప్పటి వరకు సెల్ఫ్ ప్రమోషన్ తో సరిపెట్టిన నేతలు, ఇప్పుడు ప్రజా సమస్యలకోసం పోరాటం అంటూ మరింత హడావిడి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనిది పోలవరం స్పీడ్ పెంచాలంటూ ఏపీ బీజేపీ నేతలు కేంద్ర జలశక్తి మంత్రిని కలసి వినతిపత్రం అందించారు. […]

ఏపీపై బీజేపీకి కొత్త ప్రేమ..
X

ఏపీ అసెంబ్లీలో ఒక్క సీటు లేకపోయినా తామే ప్రధాన ప్రతిపక్షం అంటారు బీజేపీ నేతలు. స్థానిక ఎన్నికల్లో సీట్లు రాకపోయినా, ఉప ఎన్నికల్లో డిపాజిట్లు లేకపోయినా ఏపీలో బీజేపీ నాయకుల హడావిడి ఏమాత్రం తగ్గదు. ఇప్పటి వరకు సెల్ఫ్ ప్రమోషన్ తో సరిపెట్టిన నేతలు, ఇప్పుడు ప్రజా సమస్యలకోసం పోరాటం అంటూ మరింత హడావిడి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనిది పోలవరం స్పీడ్ పెంచాలంటూ ఏపీ బీజేపీ నేతలు కేంద్ర జలశక్తి మంత్రిని కలసి వినతిపత్రం అందించారు. అంతేకాదు, రాయలసీమ ప్రాజెక్ట్ లను పూర్తి చేయడంలో కేంద్రం చొరవ చూపాలన్నారు.

జలజగడంపై నోరు మెదపలేదు కానీ..!
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ అడ్డుకున్నప్పుడు ఏపీలోని ప్రతిపక్షాలు నోరు తెరవలేదు. టీడీపీ సహా బీజేపీ కూడా రాయలసీమ ప్రాజెక్ట్ కి అనుకూలంగా మాట్లాడలేదు. అటు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మాత్రం, అనుమతులు లేని ఏపీ ప్రాజెక్ట్ లను నిలువరించడంలో తెలంగాణ సీఎం విఫలమయ్యారని విమర్శించింది. ఈ నేపథ్యంలో సడన్ గా ఏపీ బీజేపీకి సొంత రాష్ట్రంపై ప్రేమ పుట్టుకొచ్చింది. పోలవరం సహా, ఇతర ప్రాజెక్ట్ ల్లో వేగం పెంచడానికి కేంద్రంలో లాబీయింగ్ చేస్తోంది.

కరోనా కష్టకాలంలో ఏపీకి ఆక్సిజన్ కోటా పెంచాలన్నప్పుడు ఏపీ బీజేపీ మౌనాన్నే ఆశ్రయించింది. టీకాల సంఖ్య పెంచాలనే డిమాండ్ వినిపించినప్పుడూ ఇక్కడి బీజేపీ నేతలు సైలెంట్ గానే ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలోనూ కేంద్ర పెద్దలతో మాట్లాడేందుకు సాహసించలేదు. ప్రత్యేక హోదా అంశం మరుగున పడిపోతున్నా.. దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడెందుకో సడన్ గా రాష్ట్ర సమస్యలపై బీజేపీ నేతలు చొరవచూపడం మాత్రం విశేషం.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో.. ఎంపీలు, సీనియర్ నేతలు కేంద్ర జలశక్తి మంత్రిని కలసి ఆయనతో రాష్ట్ర సమస్యలు చర్చించారు. రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని కోరారు. ఏపీ పర్యటనకు రావాలని, ఇక్కడి కష్టాలను కళ్లారా చూడాలని మంత్రిని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని ఆ తర్వాత మీడియాతో ముచ్చటించారు. పనిలో పనిగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కూడా కలసి వినతిపత్రం అందించారు బీజేపీ నేతలు. బీజేపీ చొరవను కాదనలేం కానీ.. ఉరుములేని పిడుగులా ఇలా సడన్ గా ఏపీ బీజేపీ నేతలకు సొంత రాష్ట్రంపై ప్రేమ పుట్టుకు రావడం మాత్రం నిజంగా ఆశ్చర్యమే.

First Published:  22 July 2021 8:29 PM GMT
Next Story