Telugu Global
Health & Life Style

కోవిడ్ తో ఎముకలు డొల్ల

కరోనా మన శరీరంలోకి వచ్చిన తర్వాత అది చేసే నష్టం అంతా ఇంతా కాదు. కరోనా నుంచి కోలుకున్న వారిలో రోజుకో కొత్త సమస్య వెలుగులోకి వస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా కరోనా వల్ల బోన్ డెత్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని తేలింది. కోవిడ్‌నుంచి కోలుకున్న అరవై రోజుల తరువాత, కొంతమందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. బోన్ డెత్ అంటే ఎముక చనిపోవడం లేదా కుళ్లిపోవడం. ఎముకలలో సాధారణంగానే రక్తప్రసరణ తక్కువగా […]

కోవిడ్ తో ఎముకలు డొల్ల
X

కరోనా మన శరీరంలోకి వచ్చిన తర్వాత అది చేసే నష్టం అంతా ఇంతా కాదు. కరోనా నుంచి కోలుకున్న వారిలో రోజుకో కొత్త సమస్య వెలుగులోకి వస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా కరోనా వల్ల బోన్ డెత్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని తేలింది. కోవిడ్‌నుంచి కోలుకున్న అరవై రోజుల తరువాత, కొంతమందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.

బోన్ డెత్ అంటే ఎముక చనిపోవడం లేదా కుళ్లిపోవడం. ఎముకలలో సాధారణంగానే రక్తప్రసరణ తక్కువగా ఉంటుంది. అయితే ఆ రక్త ప్రసరణ మరింత క్షీణించినప్పుడు ఆ ఎముకలో జీవం నశిస్తుంది. ఫలితంగా అది నిర్జీవమైన ఎముకగా మారుతుంది. దీన్నే బోన్ డెత్ అంటారు.

కోవిడ్‌ చికిత్సలో భాగంగా ఎక్కువగా స్టిరాయిడ్స్‌ వాడిన వారిపై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు డాక్టర్లు. స్టెరాయిడ్స్ ఎఫెక్ట్ వల్ల కొంతమంది శరీరంలో రక్తప్రసరణ తగ్గుతుంది. అది మరీ ఎక్కువైతే శరీరంలోని కొన్ని భాగాలకు రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోతుంది. దీంతో అక్కడి ఎముక కణాలు నశిస్తాయి.
సాధారణంగా స్టిరాయిడ్స్‌ వాడిన రోగుల్లో కొందరికి ఒకట్రెండు సంవత్సరాల తరువాత బోన్‌ డెత్‌ సమస్య వస్తుంటుంది. అయితే కోవిడ్ రోగుల్లో ఇది ఆరు నెలలకే బయటపడుతుంది.

ఈ జాగ్రత్తలు మస్ట్
– ఎముకలు, కీళ్ల సమస్యలు ఉన్నవాళ్లు కరోనా నుంచి కోలుకున్న రెండు మూడు నెలల్లోపు ఓసారి ఎక్స్ రే తీయించుకోవడం మంచిది. అలాగే కోవిడ్ తర్వాత ఎముకలకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ ను కలవాలి.
– షుగర్‌, బీపీ, ఆర్తరైటిస్‌ వంటి సమస్యలున్న వారు సరైన జాగ్రత్తలతో వాటిని కంట్రోల్ లో ఉంచే ప్రయత్నం చేయాలి.
– డాక్టర్ సలహా లేకుండా స్టెరాయిడ్స్ ను అతిగా వాడడం మంచిది కాదు.
– బోన్ డెత్ ను తొలిదశలో గుర్తిస్తే అది ముదరకుండా జాగ్రత్త పడొచ్చు. అందుకే కరోనానుంచి కోలుకున్న రెండునెలల తర్వాత కీళ్ల నొప్పి, నడుము నొప్పి లాంటివి ఉంటే వెంటనే జాగ్రత్త పడడం మంచిది.

First Published:  20 July 2021 3:37 AM GMT
Next Story