Telugu Global
International

జెఫ్ బెజోస్ స్పేస్ టూర్ నేడే

మొన్న రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ మిషన్ తో స్పేస్ లోకి అడుగుపెట్టడంతో.. ప్రపంచంలోని మిగతా బిలియనీర్లకు కూడా స్పేస్ టూర్ పై మోజు మొదలైంది. తాజాగా అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా స్పేస్ టూర్ ప్లాన్ చేశారు. ఈ రోజే బెజోస్ స్పేస్ లోకి వెళ్లనున్నారు. జెఫ్ బెజోస్ 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన ‘బ్లూ ఆరిజిన్‌’ సంస్థకు చెందిన తొలి స్పేస్‌క్రాఫ్ట్‌ ‘న్యూ షెపర్డ్‌’ ఈ రోజు నింగిలోకి వెళ్లనుంది. బెజోస్‌తో పాటు […]

జెఫ్ బెజోస్ స్పేస్ టూర్ నేడే
X

మొన్న రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ మిషన్ తో స్పేస్ లోకి అడుగుపెట్టడంతో.. ప్రపంచంలోని మిగతా బిలియనీర్లకు కూడా స్పేస్ టూర్ పై మోజు మొదలైంది. తాజాగా అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా స్పేస్ టూర్ ప్లాన్ చేశారు. ఈ రోజే బెజోస్ స్పేస్ లోకి వెళ్లనున్నారు.

జెఫ్ బెజోస్ 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన ‘బ్లూ ఆరిజిన్‌’ సంస్థకు చెందిన తొలి స్పేస్‌క్రాఫ్ట్‌ ‘న్యూ షెపర్డ్‌’ ఈ రోజు నింగిలోకి వెళ్లనుంది. బెజోస్‌తో పాటు నలుగురు స్పేస్ క్రాఫ్ట్ లో భూమి నుంచి సుమారు 100 కి.మీ.ల ఎత్తున ఉన్న కార్మన్‌ లైన్‌ ను దాటి ప్రయాణించనున్నారు.

ఈ టూర్ లో శిక్షణ పొందిన అస్ట్రోనాట్స్‌ ఎవరూ లేరు. బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్, మాజీ పైలట్‌ వేలీ ఫంక్(82), యంగ్ సివిలియన్ ఆలీవర్‌ డీమన్‌(18) ఈ యాత్రలో పాల్గొననున్నారు. దానికోసం ఇప్పటికే ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. స్పేస్ లోకి ఎంటర్ అయ్యిన తర్వాత జీరో గ్రావిటీలో కేబిన్‌లో తేలియాడాల్సిన తీరు, రాకెట్‌ పనితీరు, అస్ట్రోనాట్స్‌ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కసరత్తు చేశారు.

ఈ స్పేస్ క్రాఫ్ట్ మన టైం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు నింగిలోకి ఎగురుతుంది. నో గ్రావిటీ రేంజ్ వరకూ వెళ్లి మళ్లీ తిరిగొస్తుంది. ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ నిట్టనిలువుగా టేకాఫ్‌ అయ్యి, మళ్లీ నిట్టనిలువుగానే ల్యాండ్‌ అవుతుంది.

First Published:  20 July 2021 3:14 AM GMT
Next Story